క్రీడాభూమి

పిసిబికి నిరాశే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జూలై 28: అంతర్జాతీయ మ్యాచ్‌లకు మళ్లీ ఆతిథ్యం ఇవ్వాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి గండి పడింది. రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను ఆడేందుకు రావాల్సిందిగా పిసిబి ఇచ్చిన ఆహ్వానాన్ని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) తోసిపుచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌లో సిరీస్‌లు ఆడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. లాహోర్‌లో తమ జట్టు ఆటగాళ్లపై ఉగ్రవాదులు దాడి జరిపిన తర్వాత లంక ఇప్పటి వరకూ పాక్‌లో పర్యటించలేదు. జింబాబ్వే మినహా టెస్టు హోదావున్న అన్ని దేశాలు పాక్‌కు వెళ్లకపోవడంతో పిసిబి ఆర్థికంగా చితికిపోయింది. లంక పర్యటిస్తే, ఆతర్వాత మిగతా దేశాలు కూడా పాక్‌కు క్యూ కడతాయని భావించిన పిసిబికి ఎస్‌ఎల్‌సి తిరస్కారంతో నిరాశ తప్పలేదు.