క్రీడాభూమి

మిథాలీ రాజ్‌కు రూ. కోటి నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చడంతో పాటు మహిళల వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభినందించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న మిథాలీ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువా కప్పి సన్మానించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున కోటి రూపాయల నగదు ప్రోత్సహాకంతో పాటు బంజారాహిల్స్‌లో 600 గజాల నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే మిథాలీకి కోచ్‌గా వ్యవహరించిన మూర్తికి రూ. 25 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ‘ప్రపంచ కప్ పోటీల్లో అద్భుతంగా ఆడారు. ఫైనల్ దాకా వచ్చారు. ఫైనల్లో కూడా గెలవడం ఖాయం అనుకున్నాం. దురదృష్టవశాత్తూ కొద్దితేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ మీ జట్టంతా గొప్పగా ఆడింది. దేశమంతా మీ ఆట చూసింది. నేను కూడా చూశాను. అంతా మీకు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా ఈ టోర్నీలో బాగా ఆడారు. అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డు సొంతం చేసుకున్నావు. అద్భుత ప్రతిభ కనబరిచావు. హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి నువ్వు గర్వ కారణం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి, వ్యక్తిగతంగా నా తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మనసారా అభినందనలు, ప్రభుత్వం అన్ని విధాలుగా నీకు అండగా ఉంటుంది’ అని మిథాలీతో ముఖ్యమంత్రి అన్నారు.

చిత్రం.. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసిన మిథాలీ