క్రీడాభూమి

బ్లాటర్ శకానికి తెర! (నేడు ఫిఫా అధ్యక్ష పదవికి ఎన్నికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యూరిచ్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా)పై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన సెప్ బ్లాటర్ శకం ముగియనుంది. ఈనెల 26న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఫిఫా రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో, బ్లాటర్ హయాం ముగియనుంది. ఫిఫా ఉపాధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీతోపాటు బ్లాటర్‌పైనా ఎనిమిదేళ్ల సస్పెన్షన్ వేటు పడింది. తమకు విధించిన శిక్షను వీరిద్దరూ సవాలు చేస్తూ ఫిఫా అప్పీల్స్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవలే కమిటీ ముందు హాజరై తమ వాదనలు వినిపించారు. ఇలావుంటే, తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా న్యాయం కోసం పోరాటం సాగిస్తున్నానని ప్లాటినీ అన్నాడు. ఫిఫా ఎథిక్స్ కమిటీ తనపై విధించిన సస్పెన్షన్ వేటును సవాలు చేసిన అతను ఫిఫా అప్పీల్స్ కమిటీ ముందు హాజరై వివరణనిచ్చాడు. తాను ఎలాంటి అవతకవకలకు పాల్పడలేదని అతను స్పష్టం చేశాడు. సుమారు ఎనిమిదిన్నర గంటల విచారణ అనంతరం కమిటీ హాల్ నుంచి బయటకు వచ్చిన అతను విలేఖరులతో మాట్లాడుతూ పొరపాట్లు చేసివుంటే తాను ముఖం చాటేసుకొని ఎక్కడో దాక్కొని ఉండేవాడినని వ్యాఖ్యానించాడు. సస్పెన్షన్‌ను సవాలు చేయడమే తన నిర్దోషిత్వానికి నిదర్శనమని అన్నాడు. కాగా, ప్లాటినీ వాదనతో అప్పీల్స్ కమిటీ ఏకీభవించలేదు. అతను అక్రమ పద్ధతుల్లో డబ్బు తీసుకున్నాడని నిర్ధారించిన కమిటీ అతనికి గతంలో విధించిన శిక్షను కొనసాగించాలని నిర్ణయంచింది. అయతే, శిక్షా కాలాన్ని ఎనిమిది నుంచి ఆరేళ్లకు తగ్గించింది.
అంతకు ముందు అప్పీల్స్ కమిటీ ముందు హాజరైనప్పుడు, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్లాటినీ ఇద్దరు సాక్షులను వెంట తెచ్చుకున్నాడు. 2000 దశకం ఆరంభంలో ఒప్పందం కుదుర్చుకొని పని పూర్తి చేశాడని పేర్కొంటూ 2011లో ప్లాటినీకి రెండు మిలియన్ డాలర్ల మొత్తాన్ని అప్పట్లో ఫిఫా అధ్యక్షుడిగా వ్యవహరించిన సెప్ బ్లాటర్ చెల్లించాడు. అయితే, ఫిఫా అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగడానికే అతను ఇంత భారీ మొత్తంలో బ్లాటర్ నుంచి ముడుపులు తీసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఫిఫా లెక్కల్లోగానీ, ఇతరత్రా పత్రాల్లోగానీ ఎక్కడా కనిపించని ఆ పని ఏమిటి? దానిని ప్లాటినీ ఎప్పుడు పూర్తి చేశాడు? దశాబ్దం వరకూ ఎందుకు చెల్లింపులు జరపలేదు? అధ్యక్ష పదవికి ఎన్నికల ముందు, అప్పటి వరకూ పోటీలో ఉన్న ప్లాటినీ హఠాత్తుగా ఎందుకు వైదొలిగాడు? అతను పోటీ నుంచి విరమించుకోవడానికి కొన్ని రోజుల ముందే, పాత బకాయిల పేరుతో బ్లాటర్ హడావుడిగా ఎందుకు చెల్లింపులు జరిపాడు? ఫిఫా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎందుకు ఆగలేదు? వంటి అనేకానేక ప్రశ్నలకు సరైన సమాధానాలు లభించడం లేదు. అయితే, బ్లాటర్‌తో కుదిరిన వౌఖిక ఒప్పందం ప్రకారం తాను కాంట్రాక్టు పనిని పూర్తి చేశానని అప్పీల్స్ కమిటీకి ప్లాటినీ చెప్పాడు. యూరో 2016 ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు జాక్వెస్ లాంబర్ట్, యూఫా ఉపాధ్యక్షుడు ఏంజెల్ మరియా విల్లార్ లొనా కూడా హాజరై ఈ కాంట్రాక్టు విషయంలో సాక్ష్యమిచ్చారు.

వేటు అన్యాయం
బ్లాటర్ ఆవేదన
జ్యూరిచ్: తనపై ఆరు సంవత్సరాల సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయమని ఫిఫా అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన సెప్ బ్లాటర్ అన్నాడు. తనపై విధించిన సస్పెన్షన్‌ను అతను ఫిఫా అప్పీల్స్ కమిటీలో సవాలు చేసినప్పటికీ న్యాయం జరగలేదని అన్నాడు. సస్పెన్షన్ ఎనిమిది నుంచి ఆరేళ్లకు తగ్గడం తప్ప తనకు ఏ విధమైన ఊరట లభించలేదని ఒక ప్రకటనలో తెలిపాడు. ఉద్దేశపూర్వకంగానే కొంత మంది తనను కేసుల్లో ఇరికించారని ఆరోపించాడు. ఒక ఒప్పందాన్ని అనుసరించి చేసిన పనికే తాను చెల్లింపులు జరిపానని, అధ్యక్షుడిగా కాంట్రాక్టులు కుదిర్చుకోవడం, వాటి ప్రకారం చెల్లింపులు చేయడం తన విధుల్లో భాగమని అన్నాడు. ప్లాటినీకి తాను కాంట్రాక్టు సొమ్మును ఇచ్చానే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి కాదని స్పష్టం చేశాడు. అప్పీల్స్ కమిటీలో న్యాయం జరుగుతుందని ఆశించినా ఫలితం లేకపోయందన్నాడు.