క్రీడాభూమి

నిన్న జీరో.. నేడు హీరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, జూలై 28: రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ గాయపడడంతో అనూహ్యంగా టెస్టు జట్టులోకి వచ్చిన శిఖర్ ధావన్ లంకతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదం తొక్కితే, అతనితోపాటు ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టి, కేవలం 12 అభినవ్ ముకుంద్‌పై విమర్శలు చెలరేగాయి. అతను టెస్టులకు పనికిరాడని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తే, అంతర్జాతీయ కెరీర్‌ను మానుకొని, గల్లీ క్రికెట్ ఆడాలని మరికొందరు ఎద్దేవా చేశారు. మొదటి రోజు జీరోగా నిలిచిన ముకుంద్ రెండో రోజు ఆటలో శ్రీలంక వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ నిరోషన్ డిక్‌విల్లా క్యాచ్‌ని పట్టుకొని ఔరా అనిపించుకున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో డిక్‌విల్లా కొట్టిన బంతిని సిల్లీ పాయింట్ వద్ద ముకుంద్ అక్రోబాట్ డైవ్ చేసి అందుకున్నాడు. ఆ క్యాచ్ డిక్‌విల్లాతోపాటు స్టేడియంలో కూర్చున్న ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. బ్యాటింగ్‌లో విఫలమైనా, ఫీల్డర్‌గా న్యాయం చేశాడని ఎంతో మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మూడో రోజు ఆటలో అతను 116 బంతులు ఎదుర్కొని 81 పరుగులు చేసి హీరోగా మారిపోయాడు. వేగంగా పరుగులు కొల్లగొట్టిన అతను వ్యక్తిగత రికార్డులను పట్టించుకోకుండా, సెంచరీకి చేరువవుతున్నప్పటికీ జిడ్డు బ్యాటింగ్‌తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించకుండా స్వేచ్ఛగా ఆడాడు. సెం చరీని 19 పరుగుల తేడాతో చేజార్చుకున్నప్పటికీ, బ్యా టింగ్ ప్రతిభతో విమర్శకుల నోళ్లు మూయించాడు.

చిత్రం.. అభినవ్ ముకుంద్