రాష్ట్రీయం

ఆ మూడూ నెరవేరలేదనే బాధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 29: కేంద్ర మంత్రిగా సంతృప్తికరంగానే తన విధులు నిర్వర్తించినప్పటికీ రెండు ఆకాంక్షలు నెరవేరలేదనే బాధ తనను వెంటాడుతున్నదని ఎన్‌డిఏ ఉప రాష్టప్రతి అభ్యర్థి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో శనివారం జరిగిన ఆత్మీయ సన్మాన సభలో వెంకయ్య తన మనసులో మాట బయటపెట్టారు. పూర్తి కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం కావాలనేది తన చిరకాల ఆకాంక్ష. నదుల అనుసంధానం ద్వారా దేశంలో కరవును పారదోలాలని ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడిని. సాంఘిక వివక్ష లేకుండా ఉండేందుకు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలనే ప్రయత్నం చేశాను. అయితే సాధ్యపడలేదు. జనాభా ప్రాతిపదికన ఎవరికి అందాల్సిన ఫలాలు వారికి అందాలనే ఉద్దేశంతో నేను హామీనిచ్చాను. ఈరోజు కాకపోయినా రేపైనా వర్గీకరణ జరుగుతుందని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
సాధ్యమైనంత మేర
ఆత్మీయులందరినీ కలుస్తా
ఉప రాష్టప్రతిగా ప్రమాణ స్వీకారం చేసేలోపుగా ఈ పది రోజుల్లో సాధ్యమైనంతమేర పలు ప్రాంతాలు తిరిగి ఆత్మీయులందరినీ కలుస్తానని వెంకయ్య ప్రకటించారు. అందుకే నిన్న హైదరాబాద్, నేడు విజయవాడ వచ్చి రాత్రికి తిరిగి హైదరాబాద్, రేపు విశాఖపట్టణం వెళుతున్నానని అన్నారు. 5వ తేదీ ఎన్నిక జరిగి సాయంత్రానికి ఫలితాలు వస్తాయి. మరుసటి రోజు తన ఆరాధ్యదైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని జన్మభూమి నెల్లూరు వెళ్లి ఆత్మీయులందరితో గడుపుతానని తన తక్షణ భవిష్యత్ కార్యక్రమాన్ని వివరించారు.