క్రీడాభూమి

ఇక కొత్త శకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూరిచ్: ఫిఫాలో కొత్త శకం ఆరంభం కానుందని అధ్యక్షుడిగా ఎన్నికైన ఇన్‌ఫాంటినో వ్యాఖ్యానించాడు. ఫిఫాకు ఇటీవలే కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని, కష్టాలకు ఎదురీదుతున్నామని అంటూ, పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా సాకర్‌ను మిరంత అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని తెలిపాడు. ఫిఫా వ్యవహారాలన్నీ పారదర్శకంగా సాగుతాయని హామీ ఇచ్చాడు.
ఆసియా మద్దతు ఉంటుంది
ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన ఇన్‌ఫాంటినోకు ఆసియా మద్దతు ఉంటుందని ఇబ్రహీం అల్ ఖలీఫా అన్నాడు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 27 ఓట్ల తేడాతో ఓటమిపాలైన విషయాన్ని అతను ప్రస్తావిస్తూ జయాపజయాలు సహజమని అన్నాడు. అయితే, ఎన్నికల్లో పోటీపడనంత మాత్రాన ఇన్‌ఫాంటినో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఎఫ్‌సి)కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఇబ్రహీం అల్ ఖలీఫా స్పష్టం చేశాడు. ఫిఫా అభివృద్ధికి ఇన్‌ఫాంటినో కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నాడు. ఆసియా దేశాలన్నీ అతనికి సంపూర్ణ మద్దతునిస్తాయని తెలిపాడు.

పాకిస్తాన్‌కు అత్యల్ప స్కోరు
ఢాకా, ఫిబ్రవరి 27:టి-20 ఇంటర్నేషనల్స్‌లో పాకిస్తాన్‌కు ఇది మూడో అత్యల్ప స్కోరు. గతంలో ఈ జట్టు ఆస్ట్రేలియాను ఢీకొని 74 పరుగులకే కుప్పకూలింది. 2014 వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులకు ఆలౌటైంది. తాజాగా 83 పరుగులకు చాప చుట్టేసింది. కాగా, పవర్ ప్లేలో భారత్ కేవలం 21 పరుగులు చేసింది. టి-20 ఇంటర్నేష నల్స్‌లో భారత్‌కు ఇదే అతి తక్కువ పవర్ ప్లే స్కోరు. ఇంతకు ముందు, 2010 టి-20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాను ఢీకొన్నప్పుడు టీమిండి యా 24 పరుగులు చేసింది.

ఫిన్‌కు గాయం
టి-20 వరల్డ్ కప్ టోర్నీకి దూరం
లండన్, ఫిబ్రవరి 27: ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ గాయం కారణంగా టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు దూరమయ్యాడు. అతని కాలి కండరాలు బెణికాయని, ఫిట్నెస్ సాధించేందుకు మరికొంత సమయం పడుతుందని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ఒక ప్రకటనలో తెలిపింది. అతని స్థానంలో లియామ్ ప్లంకెట్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.