క్రీడాభూమి

ఫిఫా కుర్చీపై ఇన్‌ఫాంటినో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూరిచ్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమస్య (్ఫఫా) అధ్యక్షుడిగా గియానీ ఇన్‌ఫాంటినో ఎన్నికయ్యాడు. ఐరోపా ఖండానికి చెందిన అతను ఈ రేసులో గట్టిపోటీదారు షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం ఖలీఫాను 27 ఓట్ల తేడాతో ఓడించాడు. సెప్ బ్లాటర్ వారసుడిగా, ఫిఫాకు 10వ అధ్యక్షుడిగా అవతరించాడు. బ్లాటర్ మాదిరే ఇన్‌ఫాంటినో కూడా స్విట్జర్లాండ్‌కు చెందిన వాడు కావడం వివేషం. ఎన్నికల్లో ఇబ్రహీం ఖలీఫా విజయం ఖాయమని చివరి క్షణం వరకూ అంతా జోస్యం చెప్పారు. కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఇన్‌ఫాంటినో 115 ఓట్లు దక్కించుకున్నాడు. ఎన్నికలకు కొన్ని క్షణాల వరకూ పోటీలో ఉన్న టోక్యో సెక్స్‌వేల్ హఠాత్తుగా తాను పోటీలో లేనని ప్రకటించాడు. అప్పటికే పోటీపడుతున్న అభ్యర్థుల జాబితాలో అతని పేరు ఉండగా, ఓటింగ్‌కు కొన్ని గంటల ముందు తాను వైదొలగుతున్నట్టు సెక్స్‌వేల్ తెలిపాడు. కాగా, నిర్ణయాత్మకమైన రెండో రౌండ్ ఓటింగ్‌లో ఇన్‌ఫాంటినోకు 115 ఓట్లు లభించగా, ఇబ్రహీం అల్ ఖలీపా 88 ఓట్లు సాధించాడు. ప్రిన్స్ అలీ బిన్ అల్ హుస్సేన్‌కు రెండో రౌండ్‌లో నాలుగు ఓట్లు దక్కాయి. గతంలో ఫిఫా అధికారిగా సేవలు అందించిన జెరోమ్ చాంపేంజ్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. ఫిఫాలో మొత్తం 209 సభ్యదేశాలు ఉండగా, 207 ఓట్లు పోలయ్యాయి. ఫిఫాపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించి, సుమారు పద్దెనిమిది సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగిన బ్లాటర్ నిధుల దుర్వినియోగం ఆరోపణలను ఎదుర్కొంటూ, అత్యంత అవమానకరమైన రీతిలో ఆరేళ్ల సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానులు, భారీగా నిధులు, రెండు వందలకు పైబడిన సభ్య దేశాలతో అత్యంత బలమైన క్రీడా సంస్థగా వెలిగిపోతున్న ఫిఫాను పగ్గాలు ఇన్‌ఫాంటినోకు దక్కాయి.
పారదర్శకతే ప్రామాణికం
ముడుపులు, అధికార దుర్వినియోగం, నిధుల అక్రమ మళ్లింపు వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిఫాకు ఇక ముందు పారదర్శకతే ప్రామాణికంగా ఉంటుందని, అన్ని వ్యవహారాలు ఎలాంటి దాపరికం లేకుండా జరుగుతాయని అధ్యక్ష ఎన్నికల కోసం సమావేశమైన సభ్య దేశాలు స్పష్టం చేశాయి. ఫిఫా ప్రక్షాళనకు ఉద్దేశించిన పలు సంస్కరణల ముసాయిదాను ఫిఫా మహాసభ ఆమోదించింది. సమావేశానికి హాజరైన వారిలో 179 మంది సభ్యులు సంస్కరణలకు అనుకూలంగా, 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆరుగురు ఓటింగ్‌లో పాల్గొనలేదు.
ఫిఫా కౌన్సిల్
ఫిఫా కార్యవర్గానికి ఫిఫా కౌన్సిల్‌గా మహాసభ నామకరణం చేసింది. ఒక కార్పొరేట్ కంపెనీకి చెందిన డైరెక్టర్ల బోర్డు మాదిరిగానే ఫిఫా కౌన్సిల్ పని చేస్తుంది. మహా సభ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడాన్ని మినహాయించి, ఇతరత్రా విస్తృత అధికారాలు కౌన్సిల్‌కు ఉండవు. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ హక్కులను కేటాయించడానికి భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై 14 మంది మాజీ అధికారులను స్విట్జర్లాండ్ పోలీస్‌లు అరెస్టు చేసిన తర్వాత ఫిఫా ప్రతిష్ట దారుణంగా దెబ్బతింది. అధ్యక్షుడు బాట్లర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేగాక బ్లాటర్ వారసుడిగా ముద్రపడిన యూఫా అధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీ కూడా అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నాడు. చివరికి ఇద్దరూ ఆరేళ్ల సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడికి, పాలక మండలికి ఉన్న విస్తృత అధికారాల కారణంగానే భారీ మొత్తాలు చేతులు మారాయని ఫిఫా మహాసభ అభిప్రాయపడింది. అందుకే, పాలక మండలి పేరును ఫిఫా కౌన్సిల్‌గా మార్చడమేగాక, అధికారులకు కత్తెర కూడా వేసింది.
అధికారాల్లో కోత
ఫిఫా మహాసభ తాజాగా తీసుకున్న నిర్ణయాల మేరకు అధ్యక్షుడు, అతని సహచర కార్యవర్గ సభ్యుల విస్తృత అధికారాలకు బ్రేక్ పడింది. అధికారాలపై కోతను సభ్య దేశాలు ఆమోదించాయి. అధ్యక్షుడి ప్రాపకం పొందిన వారు ఎవరైనా వివిధ హోదాలతోపాటు, ఆర్థికంగా కూడా లాభపడే అవకాశం ఇకపై ఉండదు. బోర్డుకు కార్పొరేట్ చైర్మన్ ఏ విధమైన సేవలు చేస్తాడో అవే అధికారాలు ఫిఫా అధ్యక్షుడికి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఫిఫాకు అతను మార్గదర్శకం చేయగలడే తప్ప సొంతంగా కీలక నిర్ణయాలు తీసుకోలేదు. పాలనాపరమైన వ్యవహారాల్లోనూ అధ్యక్షుడి పాత్రను కుదించారు.
36 కీలక అంశాలు
ఫిఫా మహాసభ మొత్తం 36 కీలక అంశాలను ఆమోదించింది. అధ్యక్షుడి జీతభత్యాలు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి పలు విషయాలపై మహాసభ విస్తృతంగా చర్చించింది. ఫిఫా కార్యకలాపాలను పారదర్శకంగా ఉంచేందుకు అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. 2015-2018 కాలానికి ఫిఫా బడ్జెట్‌ను 8 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో ఇప్పటికే ప్రకటించగా, దానిని క్షుణ్ణంగా విశే్లషించిన తర్వాతే నిధులు మంజూరు చేయాలని మహాసభ తీర్మానించింది.
వరల్డ్ కప్‌లో 40 జట్లు
ఇకపై ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జట్ల సంఖ్య 40కి పెరిగే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం 32 జట్లు వరల్డ్ కప్‌లో పాల్గొంటున్నాయి. అయితే, మరో ఎనిమిది జట్లకు అవకాశం కల్పించాలని, తద్వారా వరల్డ్ కప్ మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుందని ఇన్‌ఫాంటినో ఇది వరకే ప్రతిపాదించాడు. అతను ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో, వరల్డ్ కప్ రూపురేఖలు మారవచ్చని పరిశీలకులు అంటున్నారు.