క్రీడాభూమి

ముమ్మాటికీ కోహ్లీయే.. ఉత్తమ బ్యాట్స్‌మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీయే ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని పాకిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ అమీర్ అభిప్రాయ పడ్డాడు. ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అమీర్ ఈ విషయం చెప్పాడు. జో రూట్, స్టీవెన్ స్మిత్, కానె విలియమ్సన్, కోహ్లీ ఈ నలుగురిలో మీ దృష్టిలో ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మన్ అని అడగ్గా, అందరూ ఉత్తమ బ్యాట్స్‌మనే్లనని, అయితే వ్యక్తిగతంగా విరాట్ కోహ్లీకే తన ఓటని అమిర్ చెప్పాడు. ‘మీ దృష్టిలో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు?’ అని మరో అభిమాని అడగినప్పుడు సైతం కోహ్లీయేనని అమీర్ పునరుద్ఘాటించాడు. ఇంగ్లాండ్‌లో ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అమీర్ నిప్పులు చెరిగే బంతులతో భారత టాప్ ఆర్డర్ వెన్ను విరచడం తెలిసిందే. కోహ్లీతో పాటుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను అవుట్ చేయడంతో పాక్ తొలిసారి భారత్‌ను 180 పరుగుల భారీ తేడాతో ఓడించి తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకోవడం విదితమే. కాగా, 2009లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో తన తొలి ఓవర్‌లోనే సచిన్ తెండూల్కర్ వికెట్ సాధించినప్పుడు సైతం తాను ఇంతే గొప్పగా సంతోషించానని అమీర్ చెప్పాడు. సెంచూరియన్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అమీర్ బౌలింగ్‌లో తెండూల్కర్ 8 పరుగులకే అవుటయ్యాడు. కాగా 2016 ఆసియా కప్‌లో భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ స్పెల్ ఇప్పటికీ తన ఫేవరేట్ అని అమీర్ చెప్పాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ కేవలం 83 పరుగులకే ఆలవుట్ అయింది. అయితే ఆ తర్వాత భారత్ బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు అమీర్ నిప్పులు చెరిగే బంతులతో వరసగా రోహిత్, ధావన్, సురేశ్ రైనాలను పెవిలియన్‌కు పంపాడు. కేవలం 8 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించిన అమీర్ టీమిండియాను పీకల్లోతు కష్టాల్లో పడేశాడు.

మైదానంలో కోహ్లీ, అమీర్ (ఫైల్ ఫొటో)