క్రీడాభూమి

ఢిల్లీలో రేపు సిఓఎ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) పాలకుల కమిటీ (సిఓఎ) బుధవారం న్యూఢిల్లీలో బోర్డు ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని నిర్వహించనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌కు బిసిసిఐ చెల్లించాల్సిన కోట్లాది రూపాయల దీర్ఘకాలిక బకాయిల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్ని అభియోగాల నుంచి తనకు విముక్తి కల్పించిన విషయాన్ని అజారుద్దీన్ వివరించడంతో అతనికి చెల్లించాల్సిన బకాయిల గురించి బిసిసిఐ పాలకుల కమిటీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ‘అవును.. అజారుద్దీన్‌కు బిసిసిఐ చెల్లించాల్సిన దీర్ఘకాలిక బకాయిల గురించి సిఓఎ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. ప్రస్తుతం అజార్‌పై ఎటువంటి నిషేధం లేకపోవడంతో అతను బిసిసిఐ కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. భారత్ తరఫున 2000లో చివరిసారి క్రికెట్ ఆడిన అజార్ గత 17 ఏళ్ల నుంచి పెన్షన్‌ను అందుకోలేదు. అలాగే అతనికి చెల్లించాల్సిన వన్ టైమ్ ఎక్స్‌గ్రేషియాను కూడా బోర్డు నిలిపివేసింది. ఈ అంశాలపై బుధవారం జరిగే సిఓఎ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి తెలిపాడు.