క్రీడాభూమి

ఆసియా జూ.బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో అందని పసిడి పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఫిలిప్పీన్స్‌లోని పుయెర్టో ప్రినె్సకాలో జరుగుతున్న ఆసియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ను ఊరించిన పసిడి పతకం చివరికి అందకుండా పోయింది. ఈ పోటీల్లో ఫైనల్‌కు చేరుకున్న భారత బాక్సర్లు సతేందర్ రావత్ (80+ కిలోల విభాగం), మొహిత్ ఖతానా (80 కిలోలు) చివరి బౌట్లలో రజత పతకాలతో సంతృప్తి చెందడమే ఇందుకు కారణం. సోమవారం జరిగిన ఫైనల్ బౌట్‌లో సతేందర్ ఉజ్బెకిస్థాన్‌కు కు చెందిన అల్మతోవ్ షోక్రుఖ్ చేతిలో ఓటమి పాలవగా, మొహిత్ కజకిస్థాన్‌కు చెందిన తొగాంబే సగిండిక్ చేతిలో పరాజయం పాలయ్యాడు. దీంతో ఈ చాంపియన్‌షిప్స్‌లో భారత్ రెండు రజత పతకాలు, మరో ఆరు కాంస్య పతకాలతో తన పోరాటాన్ని ముగించాల్సి వచ్చింది. అంతకుముందు ఈ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు చెందిన అంకిత్ నర్వాల్ (57 కిలోలు), భవేష్ కట్టమణి (52 కిలోలు), సిద్ధార్థ్ మాలిక్ (48 కిలోలు), వినీత్ దహియా (75 కిలోలు), అక్షయ్ సివాచ్ (60 కిలోలు), అమన్ షెరావత్ (70 కిలోలు) కాంస్య పతకాలను గెలుచుకున్న విషయం విదితమే. వీరంతా సెమీ ఫైనల్ బౌట్లలో ఓటమి పాలయ్యారు.