క్రీడాభూమి

మళ్లీ బరిలోకి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి/న్యూఢిల్లీ, ఆగస్టు 7: టీమిండియా క్రికెటర్ ఎస్.శ్రీశాంత్ (34) కు కేరళ హైకోర్టులో సోమవారం పెద్ద ఊరట లభించింది. స్పాట్-్ఫక్సింగ్‌కు పాల్పడ్డాడన్న అభియోగాల ఆధారంగా శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని కేరళ హైకోర్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)ను ఆదేశించింది. అంతేకాకుండా శ్రీకాంత్‌పై బిసిసిఐ చేపట్టిన అన్ని విచారణలను పక్కన పెట్టాలని జస్టిస్ ఎ.ముహమ్మద్ ముస్తాక్ తన తీర్పులో స్పష్టం చేశారు. 2013లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆరో ఎడిషన్ టోర్నమెంట్ సందర్భంగా స్పాట్-్ఫక్సింగ్ కుంభకోణం వెలుగులోకి రావడంతో ఢిల్లీ పోలీసులు శ్రీశాంత్‌తో పాటు అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించగా, ఆ తర్వాత శ్రీశాంత్ బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు నేపథ్యంలో బిసిసిఐ తనపై జీవితకాల నిషేధాన్ని విధించడాన్ని సవాలు చేస్తూ శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. స్పాట్-్ఫక్సింగ్ కేసుకు సంబంధించిన అన్ని అభియోగాల నుంచి ఢిల్లీలోని సెషన్స్ కోర్టు తనకు విముక్తి కల్పించినప్పటికీ బిసిసిఐ తనపై జీవితకాల నిషేధాన్ని విధించి, తన రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించిందని శ్రీశాంత్ ఆ పిటిషన్‌లో సవాలు చేసిన విషయం విదితమే. దీంతో శ్రీశాంత్ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేరళ హైకోర్టు గతంలో ఆదేశించడంతో ఈ వ్యవహారంపై బిసిసిఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. స్పాట్-్ఫక్సింగ్ కేసుకు సంబంధించిన క్రిమినల్ అభియోగాల నుంచి శ్రీశాంత్‌కు విముక్తి కల్పించాలని ఢిల్లీ సెషన్స్ కోర్టు తీసుకున్న నిర్ణయం, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుతో పాటు అనుబంధ క్రికెట్ సంఘాల ఆధ్వర్యంలో జరిగే టోర్నమెంట్లలో ఆడేందుకు వీల్లేకుండా శ్రీశాంత్‌పై నిషేధం విధిస్తూ బోర్డు అంతర్గత క్రమశిక్షణా కమిటీ తీసుకున్న నిర్ణయంపై ప్రభావాన్ని చూపలేదని బిసిసిఐ తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్‌తో పాటు అవినీతి, జూదం, బోర్డు అంతర్గత క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘన వ్యవహారంలో శ్రీశాంత్ దోషి కాదా? అనే ప్రశ్న బిసిసిఐ క్రమశిక్షణ కమిటీ ముందు ఉందని, క్రమశిక్షణపై విచారణ చేపట్టేందుకు అవసరమైన ప్రామాణిక సాక్ష్యాధారాల కంటే క్రిమినల్ చట్టాల కింద శిక్షించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు ఎంతో ఉన్నతమైనవని, కనుక క్రిమినల్ చట్టాల ప్రకారం శ్రీశాంత్ శిక్షార్హుడా? కాదా? అనే విషయాన్ని న్యాయస్థానమే తేల్చాలని బిసిసిఐ పేర్కొంది.
వేచిచూసే ధోరణిలో బిసిసిఐ
ఇదిలావుంటే, శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రస్తుతానికి వేచిచూసే ధోరణి అవలంబించాలని బిసిసిఐ నిశ్చయించుకుంది. ఈ తీర్పుపై ప్రతిస్పందించాల్సిందిగా బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడు సికె.ఖన్నాను సంప్రదించగా, ‘తీర్పు వచ్చింది ఇప్పుడే కదా.. దీనిని మా న్యాయ నిపుణుల బృందం అధ్యయనం చేస్తుంది. వారి అభిప్రాయాలతో పాటు సలహాలు, సూచనలపై తగిన వేదిక (బిసిసిఐ సర్వసభ్య సమావేశం)లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు. కాగా, శ్రీశాంత్ వ్యవహారంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బిసిసిఐ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించరాదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని బోర్డు ఉపాధ్యక్షుడు టిసి.మాథ్యూ తెలిపాడు.
*ప్రతిభావంతుడైన స్వింగ్ బౌలర్‌గా పేరు పొందిన శ్రీశాంత్ గత నాలుగేళ్ల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ సినీ, రాజకీయ రంగాల్లో చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. కేరళ శాసనసభకు జరిగిన గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా తిరువనంతపురం సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి విఎస్.శివకుమార్ చేతిలో ఓటమిపాలైన శ్రీశాంత్ ‘టీమ్-5’ అనే బహుభాషా చిత్రంలో నటించాడు. ఆ చిత్రం గత వారమే విడుదలైంది.