క్రీడాభూమి

జినాన్ ఎటిపి చాలెంజర్‌లో భారత ఆటగాళ్ల వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: చైనాలోని జినాన్‌లో జరుగుతున్న ఎటిపి చాలెంజర్ ఈవెంట్‌లో భారత టెన్నిస్ ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేని సహా ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు తొలి రౌండ్‌లోనే ఘోరంగా చతికిలబడి భారత అభిమానులను తీవ్రంగా నిరాశపర్చారు. అయితే యువ ఆటగాడు విష్ణు వర్థన్ మాత్రం శుభారంభాన్ని సాధించి పరువు నిలబెట్టాడు. ప్రస్తుతం డబుల్స్‌లో చక్కగా రాణిస్తున్న విష్ణు వర్థన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 7-6(3), 6-3 సెట్ల తేడాతో చైనీస్ తైపీకి చెందిన తై చెన్‌ను మట్టికరిపించాడు. తద్వారా ఈ టోర్నీలో తొలి రౌండ్‌ను గట్టెక్కిన ఏకైక భారత ఆటగాడిగా విష్ణు వర్థన్ నిలిచాడు. రెండో రౌండ్‌లో అతను వైల్డ్‌కార్డుతో ఆడుతున్న జిజెన్ జంగ్‌తో తలపడనున్నాడు. అయితే సాకేత్ మైనేని తొలి రౌండ్‌లో 2-6, 2-6 తేడాతో రష్యాకి చెందిన రెండో సీడ్ ఆటగాడు యెవ్‌గెనీ డొన్‌స్కోయ్ చేతిలో దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. అలాగే భారత్‌కు చెందిన శశి కుమార్ ముకుంద్, క్వాలిఫయర్ సిద్ధార్థ్ రావత్, ఎన్.శ్రీరామ్ బాలాజీ, ఎన్.విజయ్ సుందర్ ప్రశాంత్ కూడా తమతమ ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలై తొలి రౌండ్‌లోనే ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. ముకుంద్ 3-6, 2-6 తేడాతో అలెగ్జాండర్ కుద్రత్సెవ్ (రష్యా) చేతిలో పరాజయాన్ని ఎదుర్కోగా, రావత్ 2-6, 4-6 తేడాతో ఏడో సీడ్ ఆటగాడు సూన్ వూ క్వోన్ (కొరియా) చేతిలోనూ, శ్రీరామ్ బాలాజీ 2-6, 2-6 తేడాతో జపాన్‌కు చెందిన మూడో సీడ్ ఆటగాడు గో సొయెడా చేతిలోనూ, క్వాలిఫయర్ ప్రశాంత్ 4-6, 4-6 తేడాతో షుయిచీ సెకిగుచి (జపాన్) చేతిలోనూ ఓటమిపాలయ్యారు.
క్వార్టర్ ఫైనల్స్‌కు బాలాజీ-వర్థన్
కాగా, పురుషుల డబుల్స్‌లో మూడో సీడ్ జోడీగా బరిలోకి దిగిన శ్రీరామ్ బాలాజీ-విష్ణు వర్థన్ 6-2, 6-2 తేడాతో తమ సహచరులైన సాకేత్ మైనేని-ప్రశాంత్ జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.