క్రీడాభూమి

తిరుగులేని మెక్ లియోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 8: ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆథ్లెటిక్ చాంపియన్‌షిప్స్‌లో జమైకాకు చెందిన ఒమర్ మెక్ లియోడ్ 110 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించి రియో ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో సాధించిన స్వర్ణ పతకానికి తోడు మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ఈ పతకాన్ని అతను తన తల్లికి, సూపర్‌స్టార్ ఉసేన్ బోల్ట్‌కు అంకితమిచ్చాడు. అయితే రెండేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి అనంతరం ఈ విభాగంలో కనీసం ఒక పతకమైనా గెలుచుకోవాలన్న అమెరికాకు చెందిన ప్రపంచ రికార్డ్ హోల్డర్ అమెరికాకు చెందిన ఏరీన్ మెరిట్ కలలు కల్లలయ్యాయి. అతను అయిదో స్థానంతో తృప్తి చెందాల్సి వచ్చింది. మొదటినుంచి చివరి దాకా ఆధిక్యతలో కొనసాగిన మెక్లియోడ్ 13.04 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని డిఫెండింగ్ చాంపియన్, రష్యాకు చెందిన సెర్గీ షుబెనెంగకోవ్‌ను రెండో స్థానానికి నెట్టి వేశాడు. హంగరీకి చెందిన బలాజ్స్ బాజీ అనూహ్యంగా కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. జమైకా జాతీయ పతకం ఎగిరేలా చేయాలనే కృతనిశ్చయంతో తాను ఈ రేస్‌లో పాల్గొన్నానని పోటీ అనంతరం మెక్ లియోడ్ చెప్పాడు. ఉసేన్ బోల్ట్‌ను ఇప్పటికీ ఒక లెజండ్‌గా పేర్కొన్న అతను తన పతకాన్ని అతనికి అంకితమిస్తున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా తన తల్లి స్టాండ్స్‌లో కూర్చుని పోటీని తిలకిస్తూ ఉన్న నేపథ్యంలో తాను ఈ పోటీని తప్పకుండా గెలవాలనుకున్నానని చెప్తూ, ఈ పతకాన్ని ఆమెకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు. చివరి హర్డిల్ వరకు కూడా పోటీలో ఉండిన మెరిట్ ఆ తర్వాత నీరస పడిపోయాడు. దీంతో అతను అయిదోవాడిగా మాత్రమే వచ్చాడు.

చిత్రం.. ఒమర్ మెక్ లియోడ్