క్రీడాభూమి

ఆసియా చాంపియన్‌షిప్‌లో చెనాయ్‌కి కాంస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: కజకిస్థాన్‌లోని ఆస్తానాలో జరుగుతున్న ఆసియా షాట్‌గన్ 7వ చాంపియన్‌షిప్‌లో భారత వర్థమాన షూటర్ కినన్ చెనాయ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో అతనికి ఈ పతకం లభించింది. సీనియర్ లెవెల్‌లో చెనాయ్‌కి ఇదే తొలి అంతర్జాతీయ పతకం. క్వాలిఫికేషన్ రౌండ్-1లో మొత్తం 75 పాయింట్లకు గాను 69 పాయింట్లు స్కోర్ చేసి మూడో స్థానంలో నిలిచిన చెనాయ్, రౌండ్-2లోనూ మెరుపులు మెరిపించాడు. మొత్తం 24 పాయింట్లకు గాను 23 పాయింట్లు రాబట్టుకుని మళ్లీ మూడో స్థానంలో నిలిచిన చెనాయ్ ఇక చివరి రౌండ్‌లో మొత్తం 125 పాయింట్లకు గాను 116 పాయింట్లు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్‌లో మొత్తం ఆరుగురు షూటర్లు అదృష్టాన్ని పరీక్షించుకోగా చెనాయ్ 30 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ పోటీలో కువైట్‌కు చెందిన అబ్దుల్ రహ్మాన్ అల్ ఫైహన్ 39 పాయింట్లు రాబట్టుకుని పసిడి పతకాన్ని కైవసం చేసుకోవడంతో పాటు ఆసియా ఫైనల్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించగా, కువైట్‌కే చెందిన మరో షూటర్ తలాల్ అల్ రషీది 38 పాయింట్లతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.