క్రీడాభూమి

నిరాశ పరిచిన నిర్మల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 8: ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్‌లో మన దేశానికి చెందిన నిర్మలా షేవోరాన్ 400 మహిళల 400 మీటర్ల పరుగుపందెం సెమీ ఫైనల్స్‌లో అట్టడుగున నిలిచి అందరినీ నిరాశ పరిచింది. నిర్మల వ్యక్తిగత ఉత్తమ టైమింగ్ 51.28 సెకన్లు కాగా, ఈ పోటీలో ఆమె 53.07 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి సెమీఫైనల్స్ రెండో హీట్‌లో పాల్గొన్న ఎనిమిది మందిలో ఏడో స్థానంలో నిలిచింది. కాగా, పోటీలో పాల్గొన్న మొత్తం 24 మంది అథ్లెట్లలో 22వ స్థానంలో నిలిచింది. మూడు సెమీఫైనల్స్ తొలి రెండు స్థానాల్లో వచ్చిన వారు, పోటీలో పాల్గొన్న మిగతా వారిలో అత్యంత వేగంగా రేస్‌ను పూర్తి చేసిన మరో ఇద్దరు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. కాగా, రెండో హీట్‌లో బహ్రేన్‌కు చెందిన సల్వా ఈద్ నసేర్ 50.08 సెకన్లతో ప్రథమ స్థానంలో నిలవగా, డిఫెండింగ్ చాంపియన్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత అల్లీసన్ ఫెలిక్స్ 50.12 సెకన్లతో రెండోస్థానంలో నిలిచింది.