క్రీడాభూమి

గామగేకు పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్, ఆగస్టు 10: భారత్‌తో జరిగే మూడవ, చివరి టెస్టుకు ఫాస్ట్ మీడియం పేసర్ లాహిరు గామగేకు లంక సెలక్టర్లు పిలుపునిచ్చారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో కైవసం చేసుకోవడంతో, శనివారం నుంచి మొదలుకానున్న మూడో టెస్టు ప్రాధాన్యతను కోల్పోయింది. వైట్ వాష్ కోసం భారత్ ప్రయత్నిస్తే, కనీసం ఒక మ్యాచ్‌ని సాధించడం ద్వారా పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక పోరాడనుంది. నువాన్ ప్రదీప్, రంగన హెరాత్ గాయాల కారణంగా జట్టుకు దూరం కావడంతో, లంక బౌలింగ్ విభాగం బలహీనపడింది. దీనితో 29 ఏళ్ల మీడియం పసర్ గామగేను 15 మంది సభ్యులతో కూడిన జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకూ టెస్టు క్రికెట్ ఆడే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన గామగేకు తుది జట్టులో స్థానం లభించడం ఖాయమని అంటున్నారు. అయితే, యువ పేసర్ దుష్మంత చమీరను ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకుంటారన్న వాదన కూడా వినిపిస్తున్నది. కాగా, జట్టులో ఫాస్ట్ బౌలర్లు లాహిరు కుమార, విశ్వ ఫెర్నాండో కూడా ఉన్నారు. వీరిలో లాహిరు కుమార మొదటి టెస్టులో ఆడాడు. విశ్వ ఫెర్నాండోకు రెండు మ్యాచ్‌ల్లోనూ అవకాశం లభించలేదు. కాబట్టి, అతనితో లంక జట్టు ప్రయోగం చేస్తుందని కొంత మంది అభిప్రాయం.

లాహిరు గామగే (ఫైల్ ఫొటో)