క్రీడాభూమి

ఫెదరర్, నాదల్ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంట్రియల్, ఆగస్టు 10: ఇక్కడ మొదలైన మాంట్రియల్ టెన్నిస్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ ముందంజ వేశారు. రెండో రౌండ్‌లో ఫెదరర్ 6-2, 6-1 తేడాతో కెనడాకు చెందిన పీటర్ పొలాన్‌స్కీని చిత్తుచేశాడు. మరో మ్యాచ్‌లో నాదల్ 6-1, 6-2 స్కోరుతో క్రొయేషియా యువ ఆటగాడు బొర్నాపై సులభంగా గెలిచాడు. మూడో రౌండ్‌లో అతను డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)ను ఢీ కొంటాడు. మరో రెండో రౌండ్ పోరులో ఫెరర్ 7-6, 3-6, 6-1 ఆధిక్యంతో జాక్ సాక్‌ను ఓడించాడు. గేల్ మోన్ఫిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన ఐదో సీడ్ కెయ్ నిషికొరీపై 6-7, 7-5, 7-6 తేడాతో అతి కష్టం మీద గెలిచాడు. ఉత్కంట భరితంగా సాగిన ఓ మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-3, 4-6, 7-6 స్కోరుతో రిచర్డ్ గా స్క్వెట్‌పై విజయం సాధించాడు.

చిత్రం.. రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్