క్రీడాభూమి

డ్రగ్స్ సరఫరా కేసులో సాకర్ స్టార్ మార్క్వెజ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో సిటీ, ఆగస్టు 10: మెక్సికో సాకర్ హీరోను అమెరికా డ్రగ్స్ సరఫరా ముఠా సభ్యుడిగా ప్రకటించడం సంచలనం రేపుతున్నది. 38 ఏళ్ల ఇసాక్ మార్క్వెజ్ ఇప్పటికీ చురుగ్గా ఫుట్‌బాల్ టోర్నీల్లో పాల్గొంటున్నాడు. గోల్స్ సాధిస్తున్నాడు. మెక్సికో నుంచి అంతర్జాతీయ సాకర్‌లో పేరుప్రఖ్యాతులు సంపాదించిన ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అరుదైన గౌరవాన్ని సంపాదించిన వారిలో హ్యుగో సాంచెజ్ మొదటివాడు. అతని తర్వాతి స్థానం మార్క్వెజ్‌కే దక్కుతుంది. 1996లో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన అతను చాలా తక్కువ కాలంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. మెక్సికో జాతీయ జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. ఇటీవలే ప్రపంచ కప్ క్వాలిఫయర్‌లో అతను కీలక గోల్ చేసి, అమెరికాపై మెక్సికోకు విజయాన్ని అందించాడు. వచ్చే ఏడాది రష్యాలో జరిగే ప్రపంచ కప్‌లో ఆడతానని సగర్వంగా ప్రకటించుకున్న మార్క్వెజ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం అతని అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. డ్రగ్స్ సరఫరాలో మార్క్వెజ్ నిందితుడని, కొన్ని ముఠాలకు అతనే నాయకత్వం వహిస్తున్నాడని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం ప్రకటించింది. ఇటీవల పోలీసులు గుట్టురట్టు చేసిన గడలజరా డ్రగ్ ర్యాకెట్‌లో 22 సూత్రధారుల పేర్లను ప్రకటించారు. ఆ జాబితాలో మార్క్వెజ్ పేరు కూడా ఉంది. ఇదంతా అబద్ధమని, అమెరికా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని అతని అభిమానులు ఆరోపిస్తున్నారు. అయితే, అమెరికా నిఘా విభాగం మాత్రం అతని నేరాన్ని నిరూపించే సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేస్తున్నది.

చిత్రం.. ఇసాక్ మార్క్వెజ్