క్రీడాభూమి

ఫైనల్ చేర్చలేకపోయిన లక్ష్మణన్ రికార్డ్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 10: భారత అథ్లెట్ గోవిందన్ లక్ష్మణన్ ఇక్కడ జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల 5,000 మీటర్ల పరుగులో సర్వశక్తులు ఒడ్డి పోరాడాడు. కెరీర్‌లోనే అత్యుత్తమంగా, లక్ష్యాన్ని 13 నిమిషాల, 35.69 సెకన్లలో పూర్తి చేశాడు. ఇంతకు ముందు అతని వ్యక్తిగత రికార్డు 13 నిమిషాల, 36.62 సెకన్లుకాగా, ప్రపంచ అథ్లెటిక్స్‌లో శక్తి వంచన లేకుండా శ్రమించాడు. ఆ ప్రయత్నంలో తన వ్యక్తిగత రికార్డును మెరుగుపరుచుకోగలిగాడే తప్ప ఈనెల 12న జరిగే ఫైనల్‌కు అర్హత సంపాదించలేకపోయాడు. హీట్స్‌లో మొదటి 15 స్థానాల్లో నిలిచిన వారికే ఫైనల్‌లో చోటు దక్కుతుంది. లక్ష్మణన్ కేవలం ఒక సెకను ఆలస్యంగా గమ్యాన్ని చేరడంతో, అతను ఫైనల్ చేరలేకపోయాడు. అయితే, వ్యక్తిగత మైలురాయిని అందుకొని సంతృప్తి చెందాడు.
మో ఫరా చివరి రేసు!
బ్రిటన్ సూపర్ అథ్లెట్ మో ఫరా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో చివరి రేసుకు సిద్ధమవుతున్నాడు. 10,000 పరుగుల విభాగంలో ఇప్పటికే స్వర్ణ పతకాన్ని సాధించిన అతను 5,000 మీటర్ల పరుగులో టైటిల్ నిలబెట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు. హీట్స్‌లో సెలెమోన్ బరెగా (ఇథియోపియా) 13 నిమిషాల, 21.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. మో ఫరా 13 నిమిషాల, 30.18 సెకన్ల టైమింగ్‌తో 12వ స్థానంలో ఉన్నాడు. శనివారం నాటి ఫైనల్‌లో అతను గత వైభవాన్ని పునరావృతం చేస్తాడా? లేదా? అన్న ఆందోళన అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తున్నది.

చిత్రం.. గోవిందన్ లక్ష్మణన్