క్రీడాభూమి

చెత్తగా ఆడి చిత్తయ్యారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ: ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఎదురైన పరాజయాన్ని పాకిస్తాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆటగాళ్లు చెత్తగా ఆడి చిత్తుగా ఓడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరాచీసహా, దేశంలోని పలు నగరాలు, పట్టణాల కూడళ్లలో ఏర్పాటు చేసిన జెయింట్ స్క్రీన్లపై మ్యాచ్‌ని వీక్షించడానికి వచ్చిన అభిమానులతో పండుగ వాతావరణం కనిపించింది. కానీ, మ్యాచ్ కొనసాగిన తీరుతో అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్ కేవలం 83 పరుగులకు ఆలౌట్‌కావడం వారిని దిగ్భ్రాణతికి గురి చేసింది. అనంతరం పాక్ బౌలర్లు చెమటోడ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. అతి సాధారణ లక్ష్యాన్ని భారత్ ఐదు వికెట్ల తేడాతో ఛేదించింది. కాగా, మ్యాచ్ ముగిసిన వెంటనే కరాచీలో వందలాది అభిమానులు నిరసనలు వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాక్ జట్టు కెప్టెన్ షహీద్ అఫ్రిదీ దిష్టిబొమ్మను దగ్ధం తగులబెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేకపోయిన అభిమానులు కర్రలు తీసుకొని టీవీ సెట్లను పగులగొట్టారు. జెయింట్ స్క్రీన్లను ముక్కముమక్కలు చేశారు. పంజాబ్ ప్రావీన్స్‌లో ఆగ్రహించిన అభిమానులు పాకిస్తాన్ క్రికెటర్లతో కూడిన పోస్టర్లను దగ్ధం చేశారు. కెప్టెన్ అఫ్రిదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కారణాలు వెతక్కండి: సికిందర్ భక్త్
ఓటమికి పదేపదే కారణాలు వెతుక్కోవద్దని పాకిస్తాన్ జట్టుకు మాజీ టెస్టు క్రికెటర్ సికందర్ భక్త్ హితవు పలికాడు. టి-20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని తొలుత ప్రకటించిన కెప్టెన్ షహీద్ అఫ్రిదీ ఇప్పుడు మాట మార్చి, తన నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నానని చెప్పడం చిత్రంగా ఉందన్నాడు. ‘అరే భాయ్ క్రికెట్ తూ ఖేలో ఔర్ పర్ఫామ్‌కరో.. ఔర్ ఖేల్తే రహో.. మత్ రిటైర్ హో.. లేకిన్ పర్ఫామ్ తో కరో’ (సోదరా ముందు క్రికెట్ ఆడు.. పర్ఫామ్ చేయి.. ఆడుతునే ఉండు.. రిటైర్ కావద్దు.. కానీ పర్ఫామ్ అయితే చేయి) అన్నాడు.
ఓడిన విధానమే బాధకారం: లతీఫ్
పాకిస్తాన్ జట్టు ఓడిన విధానం చాలా బాధాకరంగా ఉందని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. గెలుపుఓటములు సహజమని కానీ, పోరాడకుండానే చేతులెత్తేయడమే అవమానకరమని వ్యాఖ్యానించాడు. బౌలర్లు శ్రమించినప్పటికీ, బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలం కావడమే తమ జట్టు పరాజయానికి ప్రధాన కారణమని అన్నాడు. వికెట్ల మధ్య పరుగులు తీయడం కూడా నాసిరకంగా ఉందని విమర్శించాడు.
వ్యూహమే తప్పు: మిస్బా
భారత్‌పై తమ జట్టు అనుసరించిన వ్యూహమే తప్పని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ వ్యాఖ్యానించాడు. పిచ్ స్వభావాన్ని గమనించి, జాగ్రత్తగా ఆడుతూ 150 నుంచి 160 పరుగులు చేయడాన్ని లక్ష్యంగా ఎంచుకొని ఉంటే బాగుండేదన్నాడు. బ్యాట్స్‌మెన్ వైఫల్యమే జట్టును నిలువునా ముంచేసిందని అన్నాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ నైపుణ్యాన్ని మిస్బా కూడా ప్రశంసించాడు. పిచ్ తీరును, వాతావరణ పరిస్థితులను అతను చక్కగా అర్థం చేసుకొని, వ్యూహాత్మకంగా ఆడి భారత్‌ను కోహ్లీ గెలిపించిన తీరు ప్రశంసనీయమని అన్నాడు. టి-20 ఫార్మెట్‌లో బౌలర్లను గౌరవించాలని, లేకపోతే పరిస్థితులు తారుమారవుతాయని ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ చేసిన వ్యాఖ్‌యలను మిస్బా గుర్తుచేశాడు. అతని మాటలు అక్షర సత్యాలని అన్నాడు.
ఆటగాళ్లు ఓటమి బాటను వీడకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారుల పదవులకు ఎసరు తప్పదని మాజీ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ వ్యాఖ్యానించాడు. ఒకసారైతే ఎవరైనా క్షమిస్తారుగానీ, పదేపదే భారత్ చేతిలో ఓడడాన్ని అభిమానులు ఎవరూ ఒప్పుకోరని ఖాదిర్ చెప్పాడు. ఇకనైనా పాక్ అకికెటర్లు సర్వశక్తులు ఒడ్డి విజయాలను సాధించేందుకు ప్రయత్నించాలని సూచించాడు. అప్పుడే పరు వు నిలబడుతుందని అన్నాడు.