క్రీడాభూమి

చేదులోనే తీపి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 10: అమెరికా అథ్లెట్ అలిసన్ ఫెలిక్స్‌కు మహిళల 400 మీటర్ల పరుగులో చేదు అనుభవం ఎదురైంది. అయితే, మరో రకంగా ఆమెకు తీపి కబురు అందింది. టైటిల్‌పై ఫెలిక్స్, ఆమె అభిమానులు చివరి వరకూ ఎంతో ధీమాతో ఉన్నారు. కానీ, ఆమె కాంస్య పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈ అనూహ్య ఫలితం ఫెలిక్స్‌ను నిరాశ పరచింది. అయితే, ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఇది 14వ పతకం కావడం ఆమె ఆనందానికి కారణమైంది. ఈ మెగా ఈవెంట్‌లో అత్యధిక పతకాలు సాధించిన రికార్డును సంయుక్తంగా పంచుకుంటున్న మెర్లెన్ ఒట్టీ, ఉసేన్ బోల్ట్ సరసన స్థానం సంపాదించింది. పురుషుల 100 మీటర్ల స్ప్రింట్‌లో బోల్ట్ కాంస్య పతకానికే పరిమితమైనప్పటికీ, ప్రపంచ అథ్లెటిక్స్‌లో 14వ పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈసారి అతను 200 మీటర్ల పరుగులో పాల్గొనలేదు. అయితే, 4న100 మీటర్ల రిలేలో పోటీపడతాడు. ఒకవేళ ఆ విభాగంలో జమైకా జట్టు పతకాన్ని సాధిస్తే, బోల్ట్ ఖాతాలో 15వ పతకం చేరుతుంది. కాగా, ఫెలిక్స్ మరో రెండు ఈవెంట్స్‌లో పోటీపడుతుంది. 4న100, 4న400 మీటర్ల విభాగాల్లో అమెరికా మహిళల జట్లకు పతకాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ రకంగా చూసినా బోల్ట్‌తో ఫెలిక్స్ సరిసమానంగా నిలవడం లేదా అతనిని అధిగమించడం ఖాయంగా కనిపిస్తున్నది.
*సూపర్ అథ్లెట్ ఫెలిక్స్
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్ల జాబితాలో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానాన్ని ఆక్రమించిన ఫెలిక్స్ మరో రెండు ఈవెంట్స్‌లో పోటీపడాల్సి ఉంది. ఆ రెంటిలోనూ పతకాలను అందుకోగలిగితే, అటు పురుషులు, ఇటు మహిళల విభాగాల్లో మరెవరూ చేరుకోలేని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది.