క్రీడాభూమి

సువర్ణావకాశం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్: అరుదైన రికార్డును సృష్టించి, భారత టెస్టు చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టే సువర్ణావకాశం టీమిండియా ఆటగాళ్లకు లభించింది. దీనిని వారు ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. విదేశాల్లో రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌లతో కూడిన ఏ టెస్టు సిరీస్‌లోనూ భారత్ ఇప్పటి వరకూ క్లీన్ స్వీప్ సాధించలేదు. 1932లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన భారత్‌కు సుమారు 85 సంవత్సరాలుగా విదేశాల్లో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ ఒక స్వప్నంగానే మారింది. ఇప్పుడు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంకపై 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ చివరి మ్యాచ్‌ని కూడా సొంతం చేసుకుంటే, 3-0 తేడాతో ప్రత్యర్థికి వైట్ వాష్ వేస్తుంది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో నూతన ఒరవడిని సృష్టిస్తుంది. విదేశాల్లోనేకాదు.. స్వదేశంలోనూ భారత క్రికెట్ జట్టు టెస్టు సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన సంఘటనలు చాలా తక్కువ. 1993లో, మహమ్మద్ అజరుద్దీన్ నేతృత్వంలో ఇంగ్లాండ్‌ను టీమిండియా స్వదేశంలో 3-0 తేడాతో ఓడించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. అతని నాయకత్వంలోనే, 1994లో సొంతగడ్డపై న్యూజిలాండ్‌ను 3-0 తేడాతోనే ఓడించి రెండో క్లీన్ స్వీప్‌ను నమోదు చేసింది. 2014లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఆస్ట్రేలియాపై 4-0, గత ఏడాది విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌పై 3-0 తేడాతో స్వదేశంలో క్లీన్ స్వీప్స్ సాధించింది. కాగా, విదేశాల్లో అత్యుత్తమ టెస్టు విజయాలను పరిశీలిస్తే, 1967-68 సీజన్‌లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ నాయకత్వంలో న్యూజిలాండ్‌కు వెళ్లిన భారత జట్టు 3-1 ఆధిక్యంతో సిరీస్‌ను గెల్చుకుంది. కపిల్ దేవ్ కెప్టెన్సీలో, 1986లో ఇంగ్లాండ్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 తేడాతో ఓడించింది. 2004లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత్ 2-1 తేడాతో పాకిస్తాన్‌పై, 2015లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే శ్రీలంకపై 2-1 తేడాతో సురీస్‌లను కైవసం చేసుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ల్లో మాత్రం భారత్ మూడుసార్లు విదేశాల్లో క్లీన్ స్వీప్ సాధించింది. వీటిలో రెండు బంగ్లాదేశ్‌పై గెల్చుకున్నవికాగా, ఒకటి జింబాబ్వేపై నమోదు చేసిన విజయం. మొత్తం మీద విదేశాల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లతో కూడిన టెస్టు సిరీస్‌ల్లో భారత్ ఎప్పుడూ క్లీన్ స్వీప్‌ను నమోదు చేయలేదు. ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఊరిస్తున్న ఈ చిరస్మరణీయ రికార్డు కోహ్లీ బృందానికి దక్కుతుందో లేదో చూడాలి.

చిత్రం.. విరాట్ కోహ్లీ