క్రీడాభూమి

మహిళల హాకీ జర్మనీ చేతిలో భారత్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టెలెన్‌బొచ్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా టూర్‌లో భారత మహిళల జట్టు తొలి పరాజయాన్ని చవిచూసింది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌ని 0-3 తేడాతో చేజార్చుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత మహిళలే దాడులకు ఉపక్రమించారు. అయితే, జర్మనీ క్రీడాకారిణులు లిడియా హాస్, పియాసోఫీ ఓల్డ్‌హాఫర్, జూలియా ముల్లర్ తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో జర్మనీ విజయం సాధించింది.

మెక్సికన్ టెన్ని
విజేత స్లొయేన్
అకాపల్కో, ఫిబ్రవరి 28: మెక్సికన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్లొయేన్ స్టెఫెన్స్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో స్లొయేన్ 6-4, 4-6, 7-6 తేడాతో సిబుల్కొవాను ఓడించింది.
పురుషుల ఫైనల్‌లో డొమినిక్ థియేమ్ 7-6, 4-6, 6-3 స్కోరుతో బెర్నార్డ్ టామిక్‌పై విజయం సాధించాడు.

వావ్రిన్కాకు దుబాయ్ టైటిల్
దుబాయ్, ఫిబ్రవరి 28: స్టానిస్లాస్ వావ్రిన్కాకు దుబాయ్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ లభించింది. టైబ్రేకర్ వరకూ చేసిన ఫైనల్‌లో అతను 6-4, 7-6 తేడాతో మార్కోస్ బగ్దాటిస్‌ను అతను ఓడించాడు.