క్రీడాభూమి

భారత వనే్డ జట్టులో చాన్స్ ఎవరికో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: శ్రీలంకతో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఆడే భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ ఆదివారం ఎంపిక చేయనుంది. ఎమ్మెస్కే ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న టెస్టు జట్టుతో ఉన్నాడు. బిసిసిఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరీ కాండీకి బయలుదేరి వెళ్లాడు. సెలక్షన్ కమిటీలోని శరణ్‌దీప్ సింగ్, దేవాంగ్ గాంధీ స్కైప్ ద్వారా సమావేశంలో పాల్గొంటారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత్ ‘ఎ’ జట్టుతో దేవాంగ్ గాంధీ ఉన్నాడు. అతను అక్కడి నుంచే స్కైప్‌లో కలుస్తాడు. శరణ్‌దీప్ సింగ్ భారత్ నుంచే తన అభిప్రాయాలను వెల్లడిస్తాడు. ఇలావుంటే, ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో ప్రాక్టీస్ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, కేదార్ జాదవ్ తదితరులు వనే్డ జట్టులో స్థానం కోసం తమ ఫిట్నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. పలువురు యువ ఆటగాళ్లు తీవ్రంగా పోటీపడుతున్న తరుణంలో, పాత కాపుల పట్ల సెలక్టర్లు మొగ్గు చూపుతారా లేక కొత్త ప్రయోగాలు చేస్తారా అన్నది ఆశక్తికరం. ఎవరికి అవకాశం దక్కుతుందో, ఎవరికి నిరాశ మిగులుతుందో అన్నది ఆదివారం తేలిపోతుంది.
ఆడనని ఎవరన్నారు: కోహ్లీ
లంకతో జరిగే వనే్డ సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడడని వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. ‘నేను వనే్డ సిరీస్‌లో ఆడనని ఎవరన్నారు’ అంటూ తనను ప్రశ్నించిన విలేఖరులను కోహ్లీ నిలదీశాడు. వనే్డ జట్టు ఎంపిక కోసం జరిగే సమావేశంలో కెప్టెన్ హోదాలో తాను కూడా పాల్గొంటానని అన్నాడు. వనే్డ జట్టు ఎంపికపై తనకు స్పష్టత ఉందన్నాడు. కమిటీ సభ్యులకు తన అభిప్రాయాలను, సూచనలను చెప్తానని తెలిపాడు.