క్రీడాభూమి

పెద్ద భారం దిగిపోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూరిచ్: తన భుజాల పైనుంచి కొండంత భారం దిగిపోయిందని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ వ్యాఖ్యానించాడు. కొత్త అధ్యక్షుడిగా గియానీ ఇన్‌ఫాంటినో ఎన్నిక కావడంపై ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ, తన స్థానంలో ఫిఫాను ముందుకు తీసుకెళ్లే సత్తా అతనికి ఉందని ప్రశంసించాడు. 1975 నుంచి ఫిఫాతో బ్లాటర్‌కు అనుబంధం ఉంది. సుమారు 18 సంవత్సరాలు అతను ఫిఫా అధ్యక్షుడిగా సేవలు అందించాడు. ఇంతకాలం తర్వాత, ఇప్పుడు ఫిఫా అధ్యక్ష పదవికి మరొకరు ఎన్నికయ్యారని, తన పాత్ర ముగిసిందని బ్లాటర్ అన్నాడు. అధ్యక్షుడిగా కొనసాగినంత కాలం బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి నిరంతరం శక్తివంచన లేకుండా శ్రమించేవాడినని, ఫలితంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవాడినని నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆరేళ్ల సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న బ్లాటర్ తెలిపాడు. ‘నేను, నా కుమార్తె కోరిన్ అపార్ట్‌మెంట్‌లో కూర్చొని ఫిఫా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను టీవీలో ఆసక్తిగా తిలకించాను. సస్పెన్షన్‌కు గురయ్యానా? లేదా? అన్నది ఇక్కడ అప్రస్తుతం. అధికారికంగా ఎన్నికైన అధ్యక్షుడిని నేను. ఇప్పుడు అధ్యక్ష ఎన్నిక పూర్తికావడంతో నేను ఆపదవిలో లేనన్నది అధికారికంగా స్పష్టమైంది. మొత్తం మీద భుజం మీది నుంచి ఎంతో బరువు దిగిపోయిన అనుభూతి కలుగుతున్నది. ఇన్‌ఫాంటినో మార్గదర్శకంగా ఫిఫా ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను’ అని 79 ఏళ్ల బ్లాటర్ అన్నాడు. వైన్ తాగుతూ టీవీలో ఫిఫా అధ్యక్ష ఎన్నికల తీరును చూస్తూ చాలా ఆనందించాను అని వ్యాఖ్యానించాడు. తన కంటే 35 సంవత్సరాలు చిన్నవాడైన ఇన్‌ఫాంటినోకు ఫిఫాను సమర్థంగా నడిపించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని అన్నాడు. ఇన్‌ఫాంటినో ఎన్నికను తాను ముందుగానే ఊహించానని బ్లాటర్ తెలిపాడు. సభ్య దేశాలకు భారీ ప్యాకేజీలను ప్రకటించడం ద్వారా అతను రేసులో ముందుకు దూసుకెళ్లగలిగాడని చెప్పాడు.
ఆర్థికంగా బలంగానే ఉంది
ఫిఫా ఆర్థికంగా చితికిపోతున్నదని, ఇన్‌ఫాంటినో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తే కష్టాలు ఇంకా పెరుగుతాయని వచ్చిన వార్తలను బ్లాటర్ ఖండించాడు. ఫిఫా ఆర్థికంగా బలంగానే ఉందన్నాడు. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ జరిగిన ప్రతిసారీ సంస్థకు ఐదు బిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తుందని తెలిపాడు. ఇన్‌ఫాంటినో హామీలు అమలు చేసినా నష్టమేమీ ఉండదని బ్లాటర్ తెలిపాడు.