క్రీడాభూమి

మాంట్రియల్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్‌కు ఫెదరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంట్రియల్, ఆగస్టు 13: స్విట్జర్లాండ్ వీరుడు, వెటరన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఇక్కడ జరుగుతున్న మాంట్రియల్ ఓపెన్ రోజర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్ చేరాడు. సెమీ ఫైనల్‌లో అతను నెదర్లాండ్స్‌కు చెందిన రాబిన్ హాస్‌ను 6-3, 7-6 తేడాతో నేరు సెట్లలో ఓడించాడు. టైటిల్ కోసం అతను అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఢీ కొంటాడు. మరో సెమీ ఫైనల్‌లో జ్వెరెవ్ 6-4, 7-5 స్కోరుతో డెనిస్ షపొవలోవ్‌పై గెలిచాడు.
వొజ్నియాకి, స్విటోలినా ఫైనల్ పోరు
టొరంటో: డెన్మార్క్ క్రీడాకారిణి, ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి, ఉక్రెయిన్‌కు చెందిన ఎలినా స్విటోలినా ఫైనల్ చేరారు. వొజ్నియాకి 6-2, 6-3 తేడాతో హాట్ ఫేవరిట్ స్లొయేన్ స్టెఫెన్స్‌ను చిత్తుచేసింది. ఈ ఏడాది ఆమె ఫైనల్ చేరిన ఆరో టోర్నీ ఇది. మరో మ్యాచ్‌లో స్విటోలినా 6-1, 6-1 ఆధిక్యంతో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హాలెప్‌పై విజయం సాధించి, వొజ్నియాకితో తుది పోరును ఖాయం చేసుకుంది.