క్రీడాభూమి

ఫరా జోరుకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 13: బ్రిటన్ సూపర్ అథ్లెట్ మో ఫరా జోరుకు బ్రేక్ పడింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ 10,000 మీటర్ల పరుగులో టైటిల్ నిలబెట్టుకున్న అతను 5,000 మీటర్ల విభాగంలో స్వర్ణాన్ని కాపాడుకోలేకపోయాడు. ఇథియోపియాకు చెందిన ముక్తార్ ఎడ్రిస్ 13 నిమిషాల, 32.79 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఫరాకు షాకిచ్చాడు. అతను స్వర్ణ పతకాన్ని అందుకోగా, 13 నిమిషాల, 33.22 సెకన్లలో గమ్యాన్ని చేరిన ఫరా రజతంతో సంతృప్తి చెందాడు. పాల్ కెలిమో (అమెరికా/ 13 నిమిషాల, 33.30 సెకన్లు) కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు.

చిత్రం.. మో ఫరాను రెండో స్థానంలోకి నెట్టి, లక్ష్యం దిశగా దూసుకెళుతున్న ముక్తార్ ఎడ్రిస్