క్రీడాభూమి

పాపం బోల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్‌లో చివరి రేసులో పాల్గొన్న 30 ఏళ్ల బోల్ట్ 400 మీటర్ల రిలే ఈవెంట్‌లో బాటన్‌ను తన సహచరుడు యొహాన్ బ్లేక్ నుంచి తీసుకున్నాడు. అయితే, కొన్ని అడుగులు కూడా ముందుకు సాగకముందే కండరాలు బెణకడంతో పరుగును కొనసాగించలేకపోయాడు. అతి కష్టం మీద అడుగు వేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రిలేలో అదే చివరి ల్యాప్ కావడంతో, బోల్ట్ కదల్లేని పరిస్థితుల్లో వైదొలగినప్పటికీ, మిగతా జట్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. చిజిన్డు ఉజా, ఆడం గెమిలి, డానీ టైబాట్, నెహనీల్ మిచెల్ బ్లేక్ సభ్యులుగా ఉన్న గ్రేట్ బ్రిటన్ 37.47 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అమెరికాకు రజత పతకం లభించింది. 37.51 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన ఆ జట్టులో మైక్ రోజర్స్, జస్టిన్ గాట్లిన్, జేలెన్ బాకన్ క్రిస్టియన్ కోల్మన్ సభ్యులు. కాగా, మూడో స్థానాన్ని దక్కించుకున్న జపాన్ 38.04 సెకన్లలో గమ్యాన్ని చేరింది. ఈ బృందంలో షుహె తడా, షొటా లిజుకా, యొషిడే కిర్యు, కెన్జీ ఫ్యూజిమిట్సు సభ్యులుగా ఉన్నారు.
లండన్, ఆగస్టు 13: ప్రపంచ సూపర్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ అంతర్జాతీయ కెరీర్ ముగింపులో యాంటీ క్లైమాక్స్ చోటు చేసుకుంది. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌లో మూడో స్థానంతో సంతృప్తి చెందిన ‘జమైకా చిరుత’ బోల్ట్ కెరీర్‌లో చివరి రేసుగా 4న100 మీటర్ల రిలేను ఎంచుకున్నాడు. హీట్స్‌లో అద్వితీయ ప్రతిభ కనబరచి జమైకా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, తుది ప్రయత్నంలో గాయం అతనిని వెక్కిరించింది. కాలి కండరాలు బెణకడంతో విలవిల్లాడిన అతను కదల్లేని పరిస్థితిల్లో, రేసును పూర్తి చేయలేకపోయిన అతను సహచరుల సాయంతో ట్రాక్‌ను విడిచివెళ్లాడు. వేలాది మంది అభిమానులు దిగ్భ్రాంతికి గురికాగా, రిలేలో పోటీపడిన మిగతా ముగ్గురు అథ్లెట్లు యొహాన్ బ్లేక్, జూలియన్ ఫోర్డ్, ఒమర్ మెక్‌లియోడ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఒకవైపు గాయం, మరోవైపు రేసును పూర్తి చేయలేకపోయానన్న బాధ బోల్ట్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కుంటుతూ అతను ట్రాక్‌ను విడిచి వెళుతున్నప్పుడు ప్రేక్షకులు నిలబడి, హర్షధ్వానాలతో ఆ సూపర్ అథ్లెట్‌కు జేజేలు పలికారు. కనీవినీ ఎరుగని రీతిలో బోల్ట్‌కు వీడ్కోలు పలుకుదామని వచ్చిన వేలాది మంది అభిమానులు, బాధాతప్త హృదయంతో వెనుదిరిగారు. సాధారణంగా బాటన్‌ను అందుకునే వరకూ సహచరుడి రాక కోసం వేచిచూస్తూ, వామప్‌లో మాదిరి మెల్లిగా పరిగెత్తే బోల్ట్ ఆతర్వాత మెరుపు వేగంతో లక్ష్యం వైపు దూసుకెళతాడు. ఈసారి కూడా ప్రతి ఒక్కరూ అదే దృశ్యాన్ని ఊహించారు. అయితే, అతను వేగాన్ని అందుకునే ప్రయత్నంలోనే కాలి కండరాలు బెణకడంతో అడుగు ముందుకు వేయలేకపోయాడు. ఎడమ కాలి కండరాలు పట్టుకున్నాయని, ఫలితంగా అతను తీవ్రమైన బాధతో విలవిల్లాడాడని జమైకా జట్టు డాక్టర్ డెవిన్ జోన్స్ తెలిపాడు. త్వరలోనే బోల్ట్ కోలుకుంటాడని, కానీ, రేసును పూర్తి చేయలేకపోయినందుకు అతను తీవ్ర నిరాశకు గురయ్యాడని చెప్పాడు. ఇలావుంటే, లండన్‌లోని ఒలింపిక్ స్టేడియంలో రిలే ఈవెంట్ జరిగింది. ఇదే స్టేడియంలో, 2012 ఒలింపిక్స్‌లో బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లతోపాటు 4న100 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాలు సాధించి తనకు తిరుగులేదని నిరూపించాడు.
ప్రపంచ అత్లెటిక్స్‌లో బోల్ట్ మరోసారి అలాంటి అద్భుతానే్న ఆవిష్కరిస్తాడని అభిమానులు ఆశించారు. 200 మీటర్ల ఈవెంట్‌లో అతను పాల్గొనడం లేదన్న ప్రకటన రావడంతో నిరాశ చెందారు. 100 మీటర్ల స్ప్రింట్, రిలే ఈవెంట్స్ ఉడడంతో ఊరట పొందారు. స్ప్రింట్‌లో తప్పక స్వర్ణాన్ని సాధిస్తాడని అనుకున్నా, అనూహ్యంగా మూడో స్థానానికే బోల్ట్ పరిమితం కావడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విజేతగా నిలిచిన జస్టిన్ గాట్లిన్ ప్రతిభను ఎవరూ మెచ్చుకోలేదు. ఒకప్పుడు అతను డోపింగ్ పరీక్షలో పట్టుబడిన విషయానే్న పదేపదే గుర్తుచేస్తూ, బోల్ట్ ఓటమికి ఎన్నో కారణాలు వెతుక్కున్నారు. స్ప్రింట్‌లో ఓడినప్పటికీ, చివరి రేసైన రిలేలో విజృంభిస్తాడని అంచనా వేశారు. చివరి ల్యాప్‌లో పరిగెత్తడానికి ట్రాక్‌పైకి వచ్చి, పొజిషన్ తీసుకొని, పరుగు మొదలుపెట్టడంతో స్టేడియం చప్పట్లో మారుమోగింది. అయితే, బాటన్ అందుకున్న కొన్ని సెకన్లలోనే కండరాల నొప్పి బోల్ట్ పరుగుకు అడ్డుకట్ట వేసింది. సహచరులు పరుగుపరుగున వచ్చి అతనిని చేరుకున్నారు. మోకాళ్లపై చేతులు ఉంచి, బాధతో అల్లాడుతున్న అతనికి ఆసరా ఇచ్చి బయటకు తీసుకెళ్లారు. చిరుతలా పరుగులు తీస్తూ, అథ్లెటిక్స్‌లో జమైకాకు సముచిత స్థానాన్ని కల్పించిన బోల్ట్ సహచరుల సాయంతో కుంటుకుంటూ ఫినిషింగ్ లైన్ వైపు వెళ్లడం స్టేడియంలోని ప్రతి ఒక్కరినీ బాధకు గురి చేసింది. అతను లైన్‌పై కాలుపెట్టిన వెంటనే స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగింది. ఫ్లాషింగ్ లైట్లు లేవు... ‘లైట్నింగ్ బోల్ట్’ సిగ్నేచర్ ఫోజులు లేవు... విక్టరీ ల్యాప్ లేదు... నవ్వులు.. కేరింతలు.. అసలే కనిపించలేదు. ట్రాక్ నుంచి బోల్ట్‌ను నేరుగా మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ప్రేక్షకులు నిరాశతో ఇంటిదారి పట్టారు.

చిత్రం.. సహచరులు వెంటరాగా ట్రాక్ నుంచి బయటకు వెళుతున్న జమైకా స్ప్రింట్ హీరో ఉసేన్ బోల్ట్