క్రీడాభూమి

దటీజ్ ఖలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్: భారత మాజీ డబ్ల్యుడబ్ల్యుఇ రెజ్లర్ ఖలీ తానంటే ఏమీటో నిరూపించుకున్నాడు. బ్రోడీ స్టీల్‌ను చిత్తుచేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. గత వారం స్టీల్‌తో జరిగిన పోరులో గాయమైంది. అతని తలకు, మెడకు దెబ్బలు తగిలాయి. తాను కోలుకొని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన వెంటనే స్టీల్ పనిపడతానని ఖలీ ప్రకటించాడు. ఆ మాటను నిలబెట్టుకున్నాడు. ‘ది గ్రేట్ ఖలీ రిటర్న్’ పేరుతో జరిగిన ఎంటర్‌టెయిన్‌మెంట్ షోలో అతను స్టీల్‌ను ఓడించాడు.

రియోకు అర్హతపై కశ్యప్ కన్ను
ముల్హెమ్ ఆన్ డెర్ రర్ (జర్మనీ), ఫిబ్రవరి 29: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న పారుపల్లి కశ్యప్ రియో డి జెనీరియోలో ఈఏడాది జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం కోసం ప్రయత్నించనున్నాడు. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ ఆడుతున్నప్పుడు కాలి కండరాలు బెణకడంతో మొదలైన అతని ఫిట్నెస్ సమస్యలు కొనసాగుతునే ఉన్నాయి. గాయాల నుంచి అతను పూర్తిగా కోలుకున్నాడా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఎనిమిది వారాల వ్యవధిలో అతను రియోకు అర్హత సంపాదించాలి. జర్మన్ నుంచి మొదలుపెడితే, క్వాలిఫికేషన్‌కు గడువు ముగిసే వరకూ 11 ఈవెంట్స్ జరుగుతాయి. వాటిలో ఏడు లేదా ఎనిమిది ఈవెంట్స్‌లో పాల్గొంటానని కశ్యప్ అంటున్నాడు. ఈనెల 8 నుంచి 13 వరకు ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ టోర్నీ జరుగుతుంది. 15 నుంచి 20 వరకూ స్విస్ గ్రాండ్ ప్రీ ఉంటుంది. జర్మన్ ఓపెన్‌తోపాటు ఈరెండు ఈవెంట్స్‌లోనూ పాల్గొనడం ద్వారా ఫిట్నెస్‌ను నిరూపించుకోవాలని కశ్యప్ అనుకుంటున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 8వ స్థానం వరకూ చేరిన అతను ఇప్పుడు 17వ స్థానానికి పడిపోయాడు. గాయాల కారణంగా పలు టోర్నీలకు హాజరుకాకపోవడం, పాల్గొన్న ఈవెంట్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరచలేకపోవడం వంటి అంశాలు కశ్యప్ ర్యాంకింగ్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఈ తెలుగు వీరుడు తన తాజా ప్రస్థానాన్ని జర్మన్ ఓపెన్‌తో మొదలు పెట్టనున్నాడు.

స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో
బార్సిలోనా రికార్డు
మాడ్రిడ్, ఫిబ్రవరి 29: స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో పలు రికార్డులు నెలకొల్పిన బార్సిలోనా జట్టు తాజగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. సెవిల్లాతో జరిగిన మ్యాచ్‌ని 2-1 తేడాతో ఓడించి, ఒక్క పరాజయాన్ని కూడా ఎదుర్కోకుండా వరుసగా 34 మ్యాచ్‌లు పూర్తి చేసిన జట్టుగా రియల్ మాడ్రిడ్ రికార్డును సమం చేసింది. 1989లో నెలకొన్న రికార్డును బార్సిలోనా సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత బద్దలు చేసింది. కాగా, సెవిల్లాతో జరిగిన మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ, గెరార్డ్ పిక్ గోల్స్ సాధించి బార్సిలోనాను గెలిపించారు. అంతకు ముందు సెవిల్లా ఆటగాడు విటోలో 20వ నిమిషంలోనే గోల్ చేశాడు. కానీ, ఆ ఆధిక్యాన్ని సెవిల్లా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో, లావెంటేను విల్లారియల్ 3-0, వలెన్షియాను అట్లెటికో బిల్బావో 3-0, డిపొర్టివో లా కొరునాను గ్రనడా 1-0 గోల్స్ తేడాతో ఓడించాయి.