క్రీడాభూమి

రొనాల్డోపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా, ఆగస్టు 14: స్పానిష్ సూపర్ కప్‌లో బార్సిలోనాపై రియల్ మాడ్రిడ్ విజయంలో కీలక భూమిక పోషించిన క్రిస్టియానో రొనాల్డోపై పది మ్యాచ్‌ల సస్పెన్షన్ వేటు పడింది. చిరకాల ప్రత్యర్థి బార్సిలోనాను 3-1 తేడాతో రియల్ మాడ్రిడ్ ఓడించిన ఆ మ్యాచ్‌లో అతను అనుచితంగా ప్రవర్తించాడు. షర్టు విప్పి, బార్సిలోనా ఆటగాళ్లను హేళన చేశాడు. బార్సిలోనా డిఫెండర్ సామ్యూల్ అమ్‌టిటీపై దాడికి ప్రయత్నించాడు. తనకు రెడ్ కార్డు చూపి, మైదానాన్ని విడిచిపెట్టాల్సిందిగా సూచించిన రిఫరీని అతను దూరంగా నెట్టేశాడు. రొనాల్డో ప్రవర్తనపై స్పానిష్ కప్ నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. రొనాల్డోను పది మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేశారు. అంతేగాక, 4,500 డాలర్ల జరిమానా విధించారు. ఈ నిర్ణయంపై అప్పీల్ చేసుకోవడానికి పది రోజుల గడువునిచ్చారు.