క్రీడాభూమి

డేవిస్ కప్ జట్టులో పేస్‌కు దక్కని చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: కెనడాతో వచ్చేనెల జరిగే డేవిస్ కప్ మ్యాచ్‌ల్లో ఆడే భారత జట్టులో వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌కు చొటు దక్కలేదు. ఇప్పుడు బద్ధ శత్రువుగా మారిన ఒకప్పుడు అతని డబుల్స్ భాగస్వామి మహేష్ భూపతి భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా ఉన్నాడు. దీనితో 44 ఏళ్ల పేస్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో బెంగళూరులో జరిగిన డేవిస్ కప్ పోటీలకు తొలుత ఎంపిక చేసిన ఆరుగురు సభ్యుల జట్టులో పేస్ ఉన్నాడు. అయితే, చివరి నలుగురిలో అతని పేరు లేదు. తనపై కుట్ర జరుగుతున్నదని పేస్ ఆరోపణలు గుప్పించినా భూపతి వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు కెనడాతో జరిగే పోటీల్లో పేస్ లేకుండా చూడగలిగాడు.
డేవిస్ కప్ జట్టు ఇదే:
మహేష్ భూపతి (నాన్ ప్లేయింగ్ కెప్టెన్), యుకీ భంభ్రీ, రాంకుమార్ రామనాథన్, సాకేత్ మైనేని, రోహన్ బొపన్న.
స్టాండ్ బైస్: ప్రజ్ఞేష్ గునే్నశ్వరన్, శ్రీరాం బాలాజీ.