క్రీడాభూమి

జ్వెరెవ్‌కు తయాఫో బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిన్సినాటి, ఆగస్టు 17: వరుస విజయాలతో దూసుకెళుతున్న జర్మనీ యువ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు అమెరికా టీనేజ్ సంచలనం ఫ్రానె్సస్ తయాఫో బ్రేక్ వేశాడు. ఇక్కడ జరుగుతున్న సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో అతను జ్వెరెవ్‌ను 4-6, 6-3, 6-4 తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. తొలి సెట్‌ను గెల్చుకున్న జ్వెరెవ్ సులభంగానే మూడో రౌండ్ చేరతాడని అంతా ఊహించారు. కానీ, ఆతర్వాత రెండు సెట్లలో 19 ఏల్ల తయాఫో ఎవరూ ఊహించని విధంగా చెలరేగి, జ్వెరెవ్‌ను ఇంటిదారి పట్టించాడు. వెన్నునొప్పి కారణంగా రోజర్ ఫెదరర్ వైదొలగిన ఈ టోర్నీలో రాఫెల్ నాదల్ రెండో రౌండ్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా అధిగమించాడు. రిచర్డ్ గాస్క్వెట్‌ను అతను 6-3, 6-4 తేడాతో ఓడించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఒక మ్యాచ్‌లో రామోస్ వినోలాస్ 5-7, 6-4, 6-4 స్కోరుతో గిలెస్ ముల్లర్‌పై గెలిచాడు. డోమినిక్ థియేమ్ 6-3, 6-2 ఆధిక్యంతో ఫాబియా ఫొగ్నినీపై, ఆడ్రియన్ మనారియో 6-2, 7-6 తేడాతో శామ్ క్వెర్రీపై, జాన్ ఇస్నర్ 6-3, 6-3 స్కోరుతో టామీ పాల్‌పై విజయాలు నమోదు చేశారు. నకొలొజ్ బసీలష్విలి 6-3, 6-3 తేడాతో క్రిస్టియన్ హారిసన్‌ను ఓడించాడు.
భారత ఆటగాడు రాంకుమార్ రామనాథన్ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. అతనిపై జారెడ్ డొనాల్డ్‌సన్ 6-4, 3-6, 6-4 ఆధిక్యంతో గెలిచాడు. రాంకుమార్ విజయం కోసం తీవ్రంగా పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది.
వీనస్ ఓటమి
మహిళల సింగిల్స్‌లో వీనస్ విలియన్స్ ఓటమిపాలైంది. రెండో రౌండ్‌లో వీనస్‌పై అష్లే మార్టీ 6-3, 2-6, 6-2 తేడాతో విజయం సాధించింది. కాగా, మాజీ ప్రపంచ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి 6-2, 6-4 తేడాతో ఎలినా వెస్నినాను, గార్బినె ముగురుజా 6-2, 6-0 తేడాతో హదాద్ మయాను, మాడిసన్ కీస్ 6-2, 6-2 స్కోరుతో దరియా కసట్కినాను ఓడించి మూడో రౌండ్ చేరారు. అదే విధంగా కా ప్లిస్కోవా, కామిలా గియోర్గీ, ఎకతరీన మకరోవా, స్లొయేన్ స్టెఫెన్స్, సిమోనా హాలెప్, అనాస్తాసిజా సెవత్సొవా, డామినికా సిబుల్కొవా, జొహన్నా కొన్టా తమతమ ప్రత్యర్థులపై విజయాలను నమోదు చేసి మూడో రౌండ్ చేరారు.

చిత్రం..అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు షాకిచ్చిన అమెరికా టీనేజ్ సంచలనం ఫ్రానె్సస్ తయాఫో