క్రీడాభూమి

పురుషులకే అవార్డులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: అవార్డుల విషయంలో పురుషులను అందలమెక్కిస్తూ, మహిళలను విస్మరిస్తున్నారని భారత మాజీ ఫుట్‌బాలర్ ఒయినమ్ బెమ్‌బెమ్ దేవి విమర్శించింది. ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు వరుసగా మూడోసారి దరఖాస్తు చేసుకొని విఫలమైన ఆమె మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని పిటిఐతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. 2014, 2015, 2016 సంవత్సరాల్లో, వరుసగా మూడు పర్యాయాలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, తనను ఎందుకు ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదని భారత మహిళా ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బెమ్‌బెమ్ ఆవేదన వ్యక్తం చేసింది. 15 ఏళ్ల వయసులో, 1005లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆమె, నిరుడు షిల్లాంగ్‌లో జరిగిన దక్షిణాసియా గేమ్స్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించడమేగాక, టైటిల్‌ను సాధించిపెట్టింది. ఈ పోటీలు ముగిసిన వెంటనే అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. సుమారు రెండు దశాబ్దాలు భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ, 85 ఇంటర్నేషనల్స్ ఆడిన ఆమె తనకు తప్పకుండా అర్జున పురస్కారం దక్కాల్సి ఉన్నప్పటికీ, పురుషాధికారం కారణంగా లభించడం లేదని ఆరోపించింది. అవార్డులు కేవలం పురుషులకు మాత్రమే ఇస్తారా? అంటూ కేంద్రాన్ని నిలదీసింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) ర్యాంకింగ్స్‌లో తక్కువ స్థానంలో ఉన్న ఆటగాళ్లకు కూడా పద్మశ్రీ అవార్డు లభించిందని, ఉన్నత ర్యాంక్‌లో ఉండడమేగాక, భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రికార్డు కూడా ఉన్న తనకు ఎందుకు నిరాకరిస్తున్నారో చెప్పాలని నిలదీసింది. కెరీర్‌లో 64 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సుబ్రతా పాల్‌కు నిరుడు అర్జున దక్కిందని, 85 మ్యాచ్‌లు ఆడిన తనకు మాత్రం వరుసగా మూడు సంవత్సరాలుగా నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. శాఫ్ క్రీడల్లో రెండుసార్లు, దక్షిణాసియా గేమ్స్‌లో రెండుసార్లు భారత్‌కు టైటిళ్లను సంపాదించిపెట్టానని బెమ్‌బెమ్ దేవి తెలిపింది. అదే విధంగా ఆసియా క్రీడల్లో, ఒలింపిక్స్‌లో, ఎఎఫ్‌సి ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడానని పేర్కొంది. ఎన్నో విజయాలు సాధించినా, టోర్నీల్లో టైటిళ్లను గెలిచినా మహిళా ఫుట్‌బాలర్లకు ఎందుకు గుర్తింపు లభించడం లేదో తనకు తెలియడం లేదని అన్నది. తన జీవితం మొత్తాన్ని ఫుట్‌బాల్‌కే అంకితం చేశానని, కానీ, తగిన గుర్తింపు దక్కనందుకు బాధగా ఉందని తెలిపింది. అవార్డుల విషయంలో వివక్షను ప్రదర్శించడం ఒక రకంగా మహిళలను కించపరచడమేనని వ్యాఖ్యానించింది. క్రీడాకారుల్లో లింగ భేదం చూడకూడదని, అందరినీ ఒకే రకంగా ఆదరిస్తేనే దేశ క్రీడా రంగానికి మంచిదని ఆమె హితవు పలికింది.

చిత్రం.. ఒయినమ్ బెమ్‌బెమ్ దేవి