క్రీడాభూమి

సత్యనారాయణకు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: రియో పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన హైజంపర్ తంగవేలు మరియప్పన్‌కు శిక్షనిచ్చిన కోచ్ సత్యనారాయణకు చుక్కెదురైంది. ఈసారి ద్రోణాచార్య అవార్డుకు ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా నుంచి కేంద్రం అతని పేరును తొలగించింది. అతనిపై పరువునష్టం కేసు ఒకటి పెండింగ్‌లో ఉందని, అది క్రిమినల్ కేసు కాబట్టి ద్రోణాచార్య అవార్డుకు అతనిని ఎంపిక చేయడం లేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ కేసు నుంచి బయటపడిన తర్వాతే అతని పేరును పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అర్జున, రాజీవ్ ఖేల్ రత్న అవార్డులకు కోసం అందిన జాబితాలో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, టెన్నిస్ ఆటగాడు రోహన్ బొపన్న, వెయిట్‌లిఫ్టర్ సంజితా చాను అర్జున అవార్డును దక్కించుకోలేకపోతున్నారు. వీరి పేర్లను నిర్ణీత గడువు కంటే ఆలస్యంగా ప్రతిపాదించడంతో కేంద్రం వాటిని పరిగణలోకి తీసుకోలేదు.