క్రీడాభూమి

పునేరీ పల్టన్‌పై యుముంబా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ: ప్రో కబడ్డీ చాంపియ న్‌షిప్‌లో సోమవారం పునేరీ పల్టన్‌ను ఢీకొన్న యుముంబా జట్టు మూడు పాయంట్ల తేడాతో వి జయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠభరి తంగా సాగిన ఈ మ్యాజ్‌లో ఒక్కోసారి ఒక్కో మ లుపు తిరుగుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిం ది. యుముంబా 30-27 పాయంట్ల తేడాతో గెలిచి, మద్దతునివ్వడానికి భారీగా తరలి వచ్చిన అభిమా నులను సంతోషపరచింది. ఈ జట్టులో అనూప్ కుమార్ 8 పాయంట్లు సాధించాడు. అతని ప్రతిభ కు రాకేష్ కుమార్ సమయోచితమైన ఆట జతకలి సింది. రాకేష్ ఏడు పాయంట్లు చేసి యుముంబా విజయంలో తనవంతు పాత్రను పోషించాడు. రిషాంక్ దేవాడిగ, మోహిత్ చిల్లార్ చెరి ఐదు పా యంట్లు సంపాదించారు. కాగా, పునేరీ పల్టన్‌లో దీపక్ నివాస్ హూడ, జస్మేర్ సింగ్ గలియా చెరి ఆరు పాయంట్లు చేశారు. సురేంద్ర సింగ్ ఐదు పా యంట్లతో రాణించాడు. కాగా, యుముంబా జట్టు సోమవారం నాటి విజయంతో మొత్తం 50 పా యంట్లతో రెండో స్థానానికి చేరింది. పాట్నా పైరే ట్స్ 58 పాయంట్లతో అగ్రస్థానంలో ఉంది. అయ తే పాట్నా జట్టు ఇప్పటి వరకూ 14 మ్యాచ్‌లు ఆడ గా, యుముంబా 12 మ్యాచ్‌ల్లోనే పాల్గొంది. యు ముంబా చేతిలో ఓటమిపాలైన పునేరీ పల్టన్ 43 పాయంట్లతో మూడో స్థానంలో ఉంది. బెంగాల్ వారియర్స్ (42), తెలుగు టైటాన్స్ (38), జైపూర్ పింక్ పాంథర్స్ (28), బెంగళూరు బుల్స్ (13), ద బాంగ్ ఢిల్లీ (11) జట్లు పాయంట్ల పట్టికలో వరు సగా నాలుగు నుంచి ఎనిమిది స్థానాలను ఆక్ర మించుకున్నాయ.

మలింగ అన్‌ఫిట్!
మీర్పూర్: కీలక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్నాడు. అతను మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. అతని గాయం తిరగబెట్టిందని, దీనితో అతని ఫిట్నెస్‌పై అనుమానాలు ఉన్నాయని లంక కెప్టెన్ దినేష్ చండీమల్ అన్నాడు. ఒకటి రెండు మ్యాచ్‌ల్లో అతను పాల్గొనలేకపోవచ్చని చెప్పాడు. చాలాకాలంగా మలింగను గాయాలు వేధిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ సమస్య మరింత పెరిగింది. టి-20 వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్తానన్న సంకేతాలు పంపిన మలింగ అప్పటి వరకూ కెరీర్‌ను కొనసాగిస్తాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అతని ఫిట్నె స్‌పై వస్తున్న వార్తలు సహజంగానే లంక అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయ.