క్రీడాభూమి

కిర్గియోస్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిన్సినాటి, ఆగస్టు 19: సిన్సినాటి మాస్టర్స్ రోజర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో నిక్ కిర్గియోస్ సంచలనం సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో అతను తాజాగా ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని అందుకున్న రాఫెల్ నాదల్‌ను 6-2, 7-5 తేడాతో ఓడించి సెమీ ఫైనల్ చేరాడు. కాన్‌బెరాకు చెందిన 22 ఏళ్ల కిర్గియోస్ మొదటి సెట్‌ను సులభంగానే గెల్చుకున్నప్పటికీ, రెండో సెట్‌లో నాదల్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. అయితే తన వేగవంతమైన సర్వీసులు, బలమైన రిటర్న్‌తో నాదల్ ప్రయత్నాలకు గండికొట్టాడు. సెమీస్‌లో డేవిడ్ ఫెరర్‌తో పోరును ఖాయం చేసుకున్నాడు. అంతకు ముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్‌లో ఫెరర్ 6-3, 6-3 ఆధిక్యంతో డామినిక్ థియేమ్‌ను సులభంగానే ఓడించాడు. కాగా, రెండో సెమీ ఫైనల్‌లో జాన్ ఇస్నర్, గ్రిగర్ దిమిత్రోవ్ ఢీ కొంటారు. ఇస్నర్ 7-6, 7-5 స్కోరుతో జారెడ్ డొనాల్డ్‌పై గెలవగా, యూచి సుగితాను దిమిత్రోవ్ 6-2, 6-1 తేడా చిత్తుచేశాడు.
టైటిల్ దిశగా ప్లిస్కోవా
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా ప్లిస్కోవా టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకిని 6-2, 6-4 తేడాతో ఓడించింది. ఫైనల్‌లో స్థానం కోసం ఆమె గార్బెనె ముగురుజాను ఢీ కొంటుంది. ముగురుజా 6-2, 5-7, 7-5 ఆధిక్యంతో స్వెత్లానా కుజ్నెత్సొవాపై విజయం సాధించింది. స్లొయేన్ స్టెఫెన్స్, సిమోనా హాలెప్ కూడా సెమీ ఫైనల్స్ చేరారు. జూలియా జార్జస్‌పై స్టెఫెన్స్ 6-1, 7-6 ఆధిక్యంతో గెలిచింది. జొహన్నా కొన్టాను హాలెప్ 6-4, 7-6 తేడాతో ఓడించింది.
ఓడిన బొపన్న, సానియా
భారత స్టార్లు రోహన్ బొపన్న, సానియా మీర్జా తమతమ విభాగాల్లో పరాయాలను ఎదుర్కొన్నారు. క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడింగ్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో ఆడుతున్న బొపన్న 1-6, 7-6, 7-10 తేడాతో లుకాజ్ కబోట్, మార్సెలో మెలో జోడీ చేతిలో క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమిపాలయ్యాడు. మహిళల డబుల్స్‌లో సానియా, షుయ్ పెంగ్ జోడీని మోనికా నికలెస్క్యూ, సీ సువెయ్ జోడీ 6-4, 7-6 తేడతో వరుస సెట్లలో చిత్తుచేసింది.

చిత్రం..రాఫెల్ నాదల్‌ను ఓడించిన నిక్ కిర్గియోస్ (ఎడమ)