క్రీడాభూమి

శ్రీలంకలో మరో వేటకు టీమిండియా రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంబుల్లా, ఆగస్టు 19: శ్రీలంకను మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో చిత్తుచేసిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మరో వేటకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే మొదటి వనే్డలో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనుంది. 2019 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను దృష్టి ఉంచుకొని జట్టును సిద్ధం చేయడానికి ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్‌గా ఉన్న జాతీయ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో, ఈ సిరీస్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫిట్నెస్ అత్యంత కీలకమని ఇప్పటికే ఎమ్మెస్కేతోపాటు జట్టు కోచ్ రవి శాస్ర్తీ కూడా స్పష్టం చేశాడు. ఈ సిరీస్‌ను అటు సెలక్టర్లు, ఇటు జట్టు మేనేజ్‌మెంట్ క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి ఆటగాడి ప్రదర్శనను విశే్లషించడం ఖాయంగా కనిపిస్తున్నది. దీనితో ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకున్న వారంతా అత్యుత్తమ ఆటతో రాణించేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. నూటికి నూరు శాతం ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలు అందించేందుకు జరిపే ప్రయత్నంలో జట్టు మొత్తం లాభపడనుంది. అదే జరిగితే టెస్టు సిరీస్‌లో మాదిరిగానే వనే్డ సిరీస్‌లోనూ శ్రీలంకను టీమిండియా క్లీన్ స్వీప్ చేయడం కష్టం కాదు.
నాలుగో స్లాట్‌లో రాహుల్!
లోకేష్ రాహుల్ నాలుగో స్లాట్‌లో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తరచు గాయాల సమస్యతో జట్టుకు దూరమవుతున్న రాహుల్ 2016లో జింబాబ్వేపై తొలి వనే్డ ఇంటర్నేషనల్ ఆడాడు. అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు. అదే సిరీస్‌లో మరో అర్ధ శతకాన్ని కూడా అతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లో విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లు ఆడి, కేవలం 24 పరుగులు చేయగలిగాడు. మొత్తం మీద ఇంత వరకూ అతను ఆరు వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడితే, అన్నింటిలోనూ ఓపెనర్‌గానే బ్యాటింగ్‌కు దిగాడు. అయితే, ఇప్పుడు ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఉంటారన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. టెస్టు సిరీస్‌లో గొప్పగా రాణించి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్న ధావన్ అదే ఫామ్‌ను కొనసాగించే అవకాశం ఉంది. గాయాల నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చిన ముంబయి ఆటగాడు రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేయగల సమర్థుడు. ఫస్ట్‌డౌన్ (మూడో స్థానం)లో కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్‌కు వస్తాడు కాబట్టి, నాలుగో స్థానం రాహుల్‌కు దక్కవచ్చు. నిజానికి సెకండ్ డౌన్‌లో అజింక్య రహానే ఆడాలి. కానీ, ఇటీవల కాలంలో అతను నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఈ కారణంగా, కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాన్ని క్రీజ్‌లో నిలదొక్కుకునే సామర్థ్యమున్న రాహుల్‌కు ఇస్తారని అంటున్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలాకాలంగా ఐదో స్పాట్‌లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం దాదాపుగా ఖరారైంది. దీనితో ఆరో స్థానం కోసం కేదార్ జాధవ్, మనీష్ పాండే మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. గత రెండు సిరీస్‌ల్లో జాధవ్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రత్యేకించి, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతను విఫలమయ్యాడు. ఆ వైఫల్యాలను పరిగణలోకి తీసుకుంటే, ఆరో స్థానానికి జాధవ్ కంటే పాండే రేసులో ముందుంటాడు.
బౌలింగ్ విభాగం సమతూకం
భారత బౌలింగ్ విభాగం సమతూకంతో ఉంది. పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా తమ స్థానాలను ఇప్పటికే పదిలం చేసుకున్నారు. స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించాడు. స్పిన్నర్‌గా జట్టులో అతనికి చోటు ఖాయమైన నేపథ్యంలో, రెండో స్పిన్నర్‌గా ఎవరుంటారనేది ఆసక్తిని రేపుతున్నది. అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్‌లో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందనేది వాస్తవం.
లంకపై ఒత్తిడి
టెస్టు సిరీస్‌లో 0-3 తేడాతో వైట్‌వాష్ వేయించుకున్న శ్రీలంక తీవ్రమైన ఒత్తిడిలో వనే్డ సిరీస్ ఆడనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కనీసం రెండు విజయాలను సాధిస్తే, 2019 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌కు లంక నేరుగా అర్హత సంపాదిస్తుంది. లేకపోతే, క్వాలిఫయర్స్‌లో ఆడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటుంది. ఈ రకంగా కూడా లంకపై ఒత్తిడి పెరుగుతున్నది. 2015లో చివరిసారి భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడినప్పుడు లంక 0-5 తేడాతో చిత్తుగా ఓడింది. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంటుందా లేక టెస్టు సిరీస్‌లో మాదిరిగానే వనే్డల్లోనూ చేతులెత్తేస్తుందా అన్నది చూడాలి. ఇటీవలే జింబాబ్వే చేతిలో 2-3 తేడాతో వనే్డ సిరీస్‌ను కోల్పోయిన లంకకు భారత్‌పై గెలిస్తేగానీ పరువు నిలబడదు. కానీ, ఉపుల్ తరంగ నాయకత్వంలోని ప్రస్తుత లంక జట్టుకు అంత సామర్థ్యం లేదన్నది వాస్తవం. సిరీస్ ఫలితం ఎలావున్నా, కనీసం రెండు మ్యాచ్‌లను గెల్చుకొని, ప్రపంచ చాంపియన్‌షిప్‌కు క్వాలిఫై కావలన్న పట్టుదలతో లంక బరిలోకి దిగనుంది.
భారత కాలమానం ప్రకారం మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలవుతుంది.

చిత్రం..వనే్డ సిరీస్‌కు సమాయత్తమవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ