క్రీడాభూమి

యుఎఇపై పాకిస్తాన్ ప్రతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్పూర్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన పసికూన జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)పై పాకిస్తాన్ ప్రతాపం చూసింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబరచి ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. 130 పరుగుల లక్ష్యాన్ని మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే పాకిస్తాన్ ఛే దించింది. షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్ అజేయ అర్ధ శతకాలతో రాణించి, పాక్‌ను గెలిపించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యుఎఇ కేవలం ఐదు పరుగుల స్కోరువద్ద ఓపెనర్ రోహన్ ముస్త్ఫా (1) వికెట్‌ను కోల్పోయింది. ఆతర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగడంతో కోలుకోలేకపోయింది. మహమ్మద్ కలీమ్ (1), మహమ్మద్ షెజాద్ (5), ఉస్మాన్ ముస్తాక్ (9) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరగా, షైమన్ అన్వర్ 42 బంతుల్లో 46 పరుగులు చేసి, మహమ్మద్ ఇర్ఫాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరిలో మహమ్మద్ ఉస్మాన్ (21) అంజద్ జావేద్ (27 నాటౌట్), ఆరో వికెట్‌కు 46 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. మహమ్మద్ నవీద్ (10 నాటౌట్) కూడా నాటౌట్‌గా నిలవగా, యుఎఇ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 129 పరుగులు చేసింది. పాక్ బౌలర్ మహమ్మద్ అమీర్ కేవలం ఆరు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ ఇర్ఫాన్ 30 పరుగులకు రెండు వికెట్లు సాధించాడు.
పాకిస్తాన్ కూడా ఆరంభంలో తడబడింది. షర్జీల్ ఖాన్ (4), ఖుర్రం మంజూర్ (0), మహమ్మద్ హఫీజ్ (11) క్రీజ్ లో నిలవలేక ఒకరివెంట మరొకరిగా పెవిలియన్‌కు క్యూక ట్టారు. 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయన పాకి స్తాన్‌ను ఆదుకునే బాధ్యతను ఉమర్ అక్మల్, షోయబ్ మా లిక్ స్వీకరించారు. వీరిద్దరూ యుఎఇ బౌలింగ్‌ను సమర్థం గా ఎదుర్కొంటూ, వ్యూహాత్మకంగా స్కోరుబోర్డును ముం దుకు నడిపించారు. పాకిస్తాన్ 18.4 ఓవర్లలో మూడు వికె ట్లకు 131 పరుగులు చేయగా, అప్పటికి షోయబ్ మాలిక్ 49 బంతుల్లో 63 (ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు), ఉమర్ అక్మల్ 46 బంతుల్లో 50 (రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
సంక్షిప్త స్కోర్లు
యుఎఇ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 129 (షైమన్ అన్వర్ 46, మహమ్మద్ ఉస్మాన్ 21, జావేద్ 27 నాటౌట్).
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 131 (షోయబ్ మాలిక్ 63 నాటౌట్, అక్మల్ 50 నాటౌట్).

ఫైనల్ చేరతాం.. భారత్‌ను ఓడిస్తాం
మీర్పూర్: ఆసియా కప్ టోర్నమెంట్‌లో ఫైనల్ చేరతా మని, ఆతర్వాత తుదిపోరులో భారత్‌ను ఓడిస్తామని పాకి స్తాన్ చీఫ్ సెలక్టర్ హరూన్ రషీద్ వ్యాఖ్యానించాడు. ఒక మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవ సరం లేదని చెప్పాడు. ఖాయంగా ఫైనల్ చేరడమేగాక, ట్రోఫీని సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.
కాగా, భారత్‌తో మరోసారి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదు రు చూస్తున్నామని పాక్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ అ న్నాడు. ఫైనల్ చేరడం ద్వారా, భారత్‌ను ఎదుర్కొనే అవకా శాన్ని చేజిక్కించుకుంటామని అన్నాడు.