క్రీడాభూమి

ప్రాణాలు పణంగా పెట్టలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా కొనసాగేందుకు ప్రాణాలను పణంగా పెట్టలేనని భారత మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ వ్యాఖ్యానించాడు. గత ఏడాది జూన్ మాసంలో ఇంజమాముల్ హక్ నుంచి అతను అఫ్గాన్ చీఫ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాతే ఆ జట్టుకు టెస్టు హోదా లభించింది. రాజ్‌పుత్ కాంట్రాక్టు ఈనెలతో ముగుస్తుంది. ఈ కాంట్రాక్టును పొడిగించడం లేదని, కొత్త కోచ్‌ని ఎంపిక చేస్తామని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఎసిబి) ప్రకటించింది. దీనిపై రాజ్‌పుత్ పిటిఐతో మాట్లాడుతూ తనను కోచ్‌గా కొనసాగాల్సిందిగా ఎసిబి కోరిందని తెలిపాడు. అయితే, ఇటీవల కాలంలో అఫ్గాన్‌లో ఉగ్రవాద దాడులు పెచ్చరిల్లుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి కోచ్‌గా కొనసాగాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. కాబూల్‌లోని జర్మనీ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన దాడిలో 90 మంది మృతి చెందగా, నాలుగు వందలకుపైగా గాయపడిన విషయాన్ని అతను గుర్తుచేశాడు. ఒకవైపు ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తుంటే, ప్రాణాలను అరచేతిలో ఉంచుకొని రోజులు గడపడం తనకు ఇష్టం లేదని రాజ్‌పుత్ అన్నాడు. ఇదే విషయాన్ని ఎసిబికి తేల్చిచెప్పానని అన్నాడు.