క్రీడాభూమి

శ్రీకాంత్ ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లాస్గో, ఆగస్టు 21: ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ మొదటి రౌండ్‌ను సులభంగా అధిగమించి, ముందడుగు వేశాడు. పురుషుల సింగిల్స్‌లో రష్యాకు చెందిన సెర్గీ సిరాంత్‌ను ఢీకొన్న అతను 21-13, 21-12 తేడాతో విజయం సాధించాడు. ఇటీవల మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్న అతను టైటిల్‌ను అందుకునే సత్తా తనకు ఉందని తొలి రౌండ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచడం ద్వారా నిరూపించుకున్నాడు. సియాంత్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ, తెలుగు వీరుడు శ్రీకాంత్‌కు అడ్డుకట్ట వేయలేకపోయాడు.
సమీర్ వర్మ కూడా పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్ చేరాడు. మొదటి రౌండ్‌లో అతను పాబ్లో అబియన్‌ను ఢీకొని మొదటి సెట్‌ను 21-8 తేడాతో గెల్చుకున్నాడు. రెండో సెట్‌లో 17-4 ఆధిక్యాన్ని సంపాదించాడు. ఆ దశలో అబియన్ కండరాలు బెణకడంతో మ్యాచ్ నుంచి వైదొలగ్గా, సమీర్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు.
కాగా, మహిళల సింగిల్స్‌లో తన్వీ లాడ్ శుభారంభం చేసింది. మొదటి రౌండ్‌లో ఆమె చొలొ బిర్చ్‌ని 17-21, 21-10, 21-19 తేడాతో ఓడించింది.
మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో మలేసియాలో స్థిరపడిన యోగేంద్రన్ కృష్ణన్‌తో కలిసి బరిలోకి దిగిన ప్రజాక్తా సావంత్ బోణీ చేసింది. యోగేంద్రన్, ప్రజాక్తా జోడీ 21-15, 13-21, 21-18 ఆధిక్యంతో లు చియాంగ్ యవో, చియాంగ్ కాయ్ హిన్ జోడీపై గెలిచి రెండో రౌండ్ చేరింది. ఇదే విభాగంలో జరిగిన మరో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిశెట్టి, మనీషా జోడీ 24-22, 21-17 ఆధిక్యంతో టామ్ చున్ హెయ్, ఇంగ్ తిజ్ యూ జోడీపై విజయం సాధించి రెండో రౌండ్ చేరింది. పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో అనూ అత్రి, సమీత్ రెడ్డి జోడీ ఓటమిపాలైంది. వీరిపై చుంగ్ ఇయ్ సియెక్, కిమ్ డక్ యంగ్ జోడీ 22-20, 22-11 తేడాతో గెలుపొందింది.
అవకాశాలు మెరుగు..
ప్రపంచ కప్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు పతకాలు సాధించే అవకాశాలు లేకపోలేదు. అయితే, రెండేళ్ల క్రితం, 2015లో జరిగిన పోటీల్లో రజత పతకాన్ని కైవసం చేసుకున్న సైనా నెహ్వాల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం 16వ స్థానంలో ఉన్న ఆమెను ఫిట్నెస్ సమస్య వేధిస్తున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆమె పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ, నిలకడలేని ఆట ఆమె ఎంత వరకూ కోలుకుందనే అనుమానాలకు కారణమవుతున్నది. ఆమెతో పోలిస్తే, మరో హైదరాబాదీ పివి సింధుకు పతకం దక్కవచ్చన్న వాదన బలంగా వినిపిస్తున్నది. ఇంతకు ముందు రెండు పర్యాయాలు కాంస్యాలను అందుకున్న పివి గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. సుమారు రెండేళ్ల కాలంలో సైనా కంటే ఆమె మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న తెలుగు తేజం సింధుపై అభిమానుల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ టోర్నీలో ఆమె నాలుగో సీడ్‌గా బరిలో ఉంటే, సైనా 12వ సీడ్‌గా పోటీపడుతున్నది. వీరితోపాటు మహిళల సింగిల్స్‌లో రితుపర్ణ దాస్, తన్వీ లాడ్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే, వీరిద్దరిపై అభిమానుల్లో ఎలాంటి అంచనాలు లేవు. మొదటి రౌండ్‌లో బై లభించడంతో, వీరిద్దరూ మంగళవారం నాడు రెండో రౌండ్ మ్యాచ్‌లతో తమ ప్రస్థానాన్ని మొదలు పెడతారు.
ఇక పురుషుల సింగిల్స్‌లో బోణీ చేసిన కిడాంబి శ్రీకాంత్ ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించాడు. అతనితోపాటు సౌరభ్ వర్మ కూడా రెండో రౌండ్ చేరాడు. కాగా, సాయి ప్రణీత్, అజయ్ జయరామ్ కూడా పతకాల వేటను కొనసాగిస్తారు.

ఇది తెలుసా?
ఒలింపిక్స్‌లో వాడే షటిల్‌కాక్స్‌ను 16 పక్షి ఈకలతో తయారు చేస్తారు. బాతు ఈకలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. అత్యంత శక్తివంతమైన జిగురును వాడతారు. షటిల్‌కాక్స్ ఈకలతో తయారు చేసే విధానం ఎలా వచ్చిందనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. అయితే, చిత్రమైన వాదన ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు పక్షి ఈకలను పెన్నులుగా వాడేవారు. వాటిని సీరాలో ముంచి రాసేవారు. చివరలు అరిగిపోయిన ఈకలను సీసాల్లోనే ఉంచి, మరో ఈకను వాడడం అలవాటుగా ఉండేది. ఇంకు క్రమంగా చిక్కబడి, అంతకు ముందు వాడిన ఈకలన్నీ ఆ సీసాలోనే బిగుసుకుపోయేవి. పిల్లలు ఆ సీసాలతో ఆడుకునే వారు. షటిక్‌కాక్ ఆవిర్భావానికి అదే మూలమన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది.

చిత్రం..ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో శుభారంభం చేసిన భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్