తెలంగాణ

క్రీడల్లో తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి

వనపర్తి, డిసెంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తోందని, దానిని ఉపయోగించుకుని క్రీడాకారులు తెలంగాణను క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో నిలపాలని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉ పాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలోని డా.బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో శనివారం రాత్రి జరిగిన తెలంగాణ స్థాయి హాకీ పోటీల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో ఐదెకరాల్లో మినీ స్టేడియంలను నిర్మిస్తోందని, వాటిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వనపర్తిలో విద్యతోపాటు సమర్థవంతమైన క్రీడాకారులు ఉన్నారని అన్నారు. పెబ్బేరు మండలంలో వాలీబాల్‌లో ఎశ్వంత్‌కుమార్ అంతర్జాతీయ స్థాయిలో నిలవగా ఖిల్లాగనపురంలో చెపక్‌తప్రా క్రీడల్లో నవత అంతర్జాతీయ స్థాయి లో పేరుగడించారని ఆయన చెప్పారు. అలాంటి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. వనపర్తిలో రోడ్ల విస్తరణ చేయకపోవడం వల్ల అపరిశుభ్రత నెలకొని అంటువ్యాధులు ప్రబలుతున్నాయని, త్వరలో రోడ్ల విస్తరణ చేపట్టి పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని అన్నా రు. జూనియర్ కళాశాల మైదానాన్ని తీర్చిదిద్ది ప్రహరీతోపాటు షాపింగ్ కాంప్లెక్సు నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని, రాబోయే తరం వాటి ఫలితాలను అనుభవించాలని ఆయన అన్నారు. చదువుతోపాటు సమానంగా క్రీడల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచంలోనే అత్యధిక మెడల్స్‌ను చైనా క్రీడాకారులు గెలుచుకున్నారని, అందుకు ప్రభుత్వ ప్రోత్సాహమే కారణమని అన్నారు. తెలంగాణలో కూడా ఆలాగే ప్రోత్సహిస్తామని, భవిష్యత్‌లో క్రీడాకారులు తెలంగాణకు మంచి పేరు తేవాలని ఆయన సూచించారు. ఆలాగే స్కూల్ గేమ్స్‌కు ఫండ్‌ను ఏర్పాటు చేసేందుకు వచ్చే బడ్జెట్‌లో కేటాయించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
రాష్టస్థ్రాయి హాకీ పోటీల్లో విజేత పాలమూరు జట్టు
వనపర్తి డా.బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాలమూరు బాల, బాలికల జట్లు విన్నర్స్‌గా నిలిచాయి. బాలుర పోటీల్లో మహబూబ్‌నగర్ ప్రథమ, నిజామాబాద్ ద్వితీయ, ఆదిలాబాద్ తృతీయ స్థానాలు సాధించగా బాలు ర జట్లలో మహబూబ్‌నగర్ ప్రథమ, నిజామాబాద్ ద్వితీయ, మెదక్ తృతీ య స్థానాలను సాధించాయి. వీరికి ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శంకర్‌నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ బి.కృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మయ్య, వైస్ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.