క్రీడాభూమి

పాక్ క్రికెటర్లకు రక్షణపై బిసిసిఐ హామీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్లకు సంపూర్ణ రక్షణ కల్పిస్తా మని, ఈ విషయంలో ఎలాంటి భయాందోళనకు తావులేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) హామీ ఇచ్చిందని స మాచారం. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వర్గా లు వెల్లడించాయ. హిమాచల్ ప్రదేశ్‌లో భద్రత కల్పించలేమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తున్నది. దీనితో బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్వ యంగా రంగంలోకి దిగి, పిసిబి అధ్యక్షుడు షహర్యార్ ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తుంది. పాక్ క్రికెటర్ల భద్రత గురిం చిన ఆందోళనలు అవసరం లేదని, వారి రక్షణ బాధ్యతను తా ము స్వీకరిస్తామని షహర్యార్‌కు శశాంక్ భరోసా ఇచ్చాడని పిసి బి వర్గాలు తెలిపాయ. అన్ని అంశాలను అతను సంపూర్ణగా వివ రించాడని పేర్కొన్నాయ. షహర్యార్ కూడా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తున్నది. ఇలావుంటే, బిసిసిఐ, హిమాచల్ ప్రదేశ్ సర్కారు మధ్య సయోధ్యకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తున్నది. ధర్మశాలలోనే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ని ఆ డించేందుకు కృషి చేస్తున్నది. చివరి క్షణాల్లో మ్యాచ్ కేంద్రాన్ని మార్చడం సాధ్యం కాదని బిసిసిఐ అంటుండగా, మ్యాజ్‌కి భ ద్రత కల్పించడం కష్టమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ భద్ర సింగ్ అంటున్నాడు. ఈ నేపథ్యంలో సమస్యను సున్నితం గా పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయ. ధర్మశాలలో మ్యాచ్ వద్దంటూ కాంగ్రెస్ కీలక నేతలు డిమాండ్ చేస్తున్న నేప థ్యంలో ఈ వివాదం రాజకీయ పార్టీల మధ్య ఘర్షణగా రూపాం తరం చెందుతున్నది.