క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్‌లో సవాళ్లు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించడం అనుకున్నంత సులభం కాదని, అక్కడ తమకు సవాళ్లు తప్పవని భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా వ్యాఖ్యానించింది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్యర్యంలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆమె విలేఖరులతో మాట్లాడుతూ మహిళల డబుల్స్‌లో మార్టినా హింగిస్‌తో కలిసి ఆడుతున్న తనకు ఫ్రెంచ్ ఓపెన్ సవాళ్లను విసురుతున్నదని చెప్పింది. ఆ టోర్నీ క్లే కోర్టుపై జరుగుతుందని, తాము ఆ తరహా కోర్టుపై తమకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పింది. అయితే, శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, టైటిల్ కైవసం చేసుకునే అవకాశాలు తమకు ఎక్కువగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేసింది. వరుసగా గత మూడు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో హింగిస్‌తో కలిసి విజేతగా నిలిచిన సానియా తెలిపింది. ‘సాన్‌టినా’గా పేరుపొందిన సానియా, హింగిస్ జోడీ విజయపరంపరలకు గత వారం జరిగిన కతార్ ఓపెన్‌లో బ్రేక్ పడిన విషయం తెలిసిందే. వీరిపై ఎలెనా వెస్నినా, డరియా కసట్కినా జోడీ గెలవడంతో, 41 వరుస విజయాలను నమోదు చేసిన ఈజోడీ ప్రపంచ రికార్డును సమం చేసే అవకాశాన్ని కేవలం మూడు విజయాల తేడాతో కోల్పోయింది. జానా నవోత్న, హెలెనా సుకోవా 44 వరుస విజయాలతో నెలకొల్పిన రికార్డును సాన్‌టినా జోడీ కొద్దిలో చేజార్చుకుంది.