క్రీడాభూమి

వీనస్ రాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్: ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ ఎట్టకేలకు తన పంతం వీడి రాజీకొచ్చింది. వచ్చే వారం ప్రారంభం కానున్న ఇండియన్ వెల్స్‌లో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ టోర్నీలో ఆడరాదని 15 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది. 2001లో అక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు వీనస్, ఆమె సోదరి సెరెనా విలియమ్స్‌లను ప్రేక్షకులు హేళన చేశారు. తన కుమార్తెలను జాతి వివక్షతో కూడిన మాటలతో వేధించారని, వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఇండియన్ వేల్స్‌లో ప్రేక్షకులు, అధికారులు ప్రవర్తించారని వీనస్, సెరెనా తండ్రి రిచర్డ్ విలియమ్స్ ఆరోపించాడు. ఈ సంఘటన తర్వాత ఇండియన్ వెల్స్‌లో ఆడేది లేదని అక్కాచెల్లెళ్లు స్పష్టం చేశారు. అవమానాలను ఎదుర్కొంటూ మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం తమకు లేదని అప్పట్లో ప్రకటించారు. కాగా, గత ఏడాది సెరెనా మనసు మార్చుకుంది. కొంత మంది చేసిన పొరపాటుకు అందరినీ బాధ్యులను చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. 2015లో సెరెనా ఇండియన్ వెల్స్ టోర్నీలో పాల్గొనగా, ఆమె అడుగుజాడల్లోనే నడవాలని వీనస్ కూడా నిర్ణయించింది. ఈఏడాది ఇండియన్ వెల్స్‌తో ఆడతానని తెలిపింది.