క్రీడాభూమి

జర్మనీ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ శ్రీకాంత్, కశ్యప్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్హెమ్ ఆన్ డెర్ రూ (జర్మనీ): ఇక్కడ జరుగుతున్న జర్మనీ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ శుభారంభం చేశారు. ఈఏడాది జనవరిలో జరిగిన సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను కైవసం చేసుకున్న శ్రీకాంత్ ఇక్కడ మొదటి రౌండ్‌లో జపాన్ క్రీడాకారుడు తకుమా ఉయేదాను 12-21, 21-18, 21-11 తేడాతో ఓడించడం ద్వారా టైటిల్ రేసును ఆరంభించాడు. తర్వాతి రౌండ్‌లో అతను నెదర్లాండ్స్‌కు చెందిన ఎరిక్ మెజిస్‌ను ఢీ కొంటాడు. కాగా, కశ్యప్ 21-9, 21-9 ఆధిక్యంతో ఉక్రెయిన్ ఆటగాడు అర్టెమ్ పొచటరెవ్‌పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో యువ షట్లర్ సమీర్ వర్మ 21-9, 21-8 స్కోరుతో కొరియా ఆటగాడు లీ డాంగ్ కుయెన్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. మరో భారత క్వాలిఫయర్ కుశాల్ ధర్మామెర్ 21-4, 21-14 తేడాతో మార్క్ జీబ్లెర్‌పై గెలిచాడు.
రెండో రౌండ్‌కు సింధు
మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు రెండో రౌండ్ చేరింది. మొదటి రౌండ్‌లో ఆమె షాఫెర్ రోంగ్‌ను 21-11, 21-13 తేడాతో ఓడించింది. ఈ టోర్నీలో టాప్ స్టార్ సైనా నెహ్వాల్ ఫిట్నెస్ సమస్య కారణంగా పాల్గొనలేకపోవడంతో మహిళల సింగిల్స్‌లో భారత ఆశలన్నీ సింధుపైనే ఉన్నాయ.