క్రీడాభూమి

ధర్మశాలలో మ్యాచ్ ఆడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ: టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌తో ఈనెల 19న జరిగే మ్యాచ్‌లో ఆడొద్దని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మాజీ చీఫ్ ఇషాన్ మణి హితవు పలికాడు. ఈ మ్యాచ్‌కి భద్రత కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ స్పష్టం చేసిన విషయాన్ని అతను పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ, ఇది ఆషామాషీ ప్రకటన కాదని అన్నాడు. పాక్ క్రికెటర్లకు ధర్మశాలలో ప్రమాదం పొంచివుందనే విషయాన్ని వీర్‌భద్ర సింగ్ తేల్చిచెప్పారని అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మశాలలో మ్యాచ్ ఆడడం సమంజసం కాదని చెప్పాడు. పిసిబి అధ్యక్షుడు షహర్యార్ ఖాన్‌కు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఫోన్ చేసి, ధర్మశాలలో పాక్ క్రికెటర్లకు సంపూర్ణ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు వచ్చిన వార్తలపై మణి స్పందించాడు. ఆటగాళ్లకు నష్టం వాటిల్లే ఎలాంటి నిర్ణయానికి రావద్దని అతను పిసిబిని కోరాడు.
ఐసిసికి లేఖ
ధర్మశాలలో మ్యచ్‌కి భద్రతా ఏర్పాట్లు చేయడం కష్టమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ భారత హోం మంత్రిత్వ శాఖకు స్పష్టం చేయడంపై పిసిబి ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులను వివరిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి లేఖ రాసింది. ధర్మశాల మ్యాచ్‌పై నెలకొన్న గందరగోళ పరిస్థితులను వివరించింది. భద్రత కల్పించడం కష్టమని అక్కడి ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించిన నేపధ్యంలో ఆటగాళ్లకు ప్రమాదం పొంచివుందేమోనన్న అనుమానం తలెత్తుతున్నదని పిసిబి వర్గాలు వ్యాఖ్యానించాయి. పిసిబి, బిసిసిఐ అధ్యక్షులు షహర్యార్ ఖాన్, శశాంక్ మనోహర్ మధ్య జరిగిన చర్యల్లో ధర్మశాల మ్యాచ్‌ని కోల్‌కతా లేదా మొహాలీకి మార్చాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందని ఈ వర్గాలు తెలిపాయి. అయితే, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నాయి.

ఏర్పాట్లు అద్భుతం!
ధర్మశాల: టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే హైవోల్టేజీ మ్యాచ్‌కి వేదికైన ధర్మశాలలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని టోర్నమెంట్ డైరెక్టర్ ఎంవి శ్రీ్ధర్ కితాబునిచ్చాడు. బుధవారం నిర్వాహణ కమిటీ సభ్యులతో కలిసి ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పిసిఎ) స్టేడియాన్ని సందర్శించిన అతను ఏర్పాట్లను పరిశీలించాడు. పాక్ ఆటగాళ్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శ్రీ్ధర్ పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది. భద్రతసహా వివిధ అంశాలపై హెచ్‌పిసిఎ తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని శ్రీ్ధర్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసిన అతను, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ భద్రతా ఏర్పాట్లపై వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పందించడానికి నిరాకరించాడు.