క్రీడాభూమి

నమ్మకాన్ని వమ్ము చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ: ఆసియా కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరలేకపోయిన పాకిస్తాన్ ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓటమిపాలైన పాక్ బుధవారం నాటి అత్యంత కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడి పరాజయాన్ని ఎదుర్కొంది. దీనితో ఫైనల్ చేరలేకపోయింది. బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా విఫలం కావడం వల్లే పాక్ జట్టు 129 పరుగులు మాత్రమే చేయగలిగిందని, ఆతర్వాత బంగ్లాదేశ్‌ను లక్ష్యం చేరకుండా నిలువరించేందుకు బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. బంగ్లాదేశ్‌ను ఓడించి, ఫైనల్ చేరుతుందని ఆశించానని, కానీ తన ఆశలు నీరుగారిపోయాయని అన్నాడు. భారత్, పాకిస్తాన్ ఫైనల్ పోరును చూద్దామని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలిందని అన్నాడు.
బౌలర్లు సర్వశక్తులు ఒడ్డినా ఫలితం దక్కలేదని, బంగ్లాదేశ్ చేతిలో ఓటమికి బ్యాట్స్‌మెన్ ప్రధాన కారణమని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ అభిప్రాయపడ్డాడు. దేశవాళీ పోటీల్లో రాణిస్తున్న ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వడం ద్వారా బలమైన జట్టును తయారు చేసేందుకు సెలక్టర్లు చేస్తున్న కృషి వృథా అవుతున్నదని వాపోయాడు. బంతి విపరీతంగా బౌన్స్ అవుతూ, ఎప్పటికప్పుడు దిశను మార్చుకొని దూసుకెళుతున్న మీర్పూర్ పిచ్‌పై అన్వర్ అలీతో ప్రయోగం చేయడం వల్ల నష్టమే తప్ప లాభం లేకపోయిందని అన్నాడు. ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌కు ఎక్కువ ఓవర్లు ఇచ్చివుంటే బాగుండేదని అన్నాడు.
అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్‌తో ప్రస్తుతం జట్టుకు దూరమైన సరుూద్ అజ్మల్ కూడా కెప్టెన్ నిర్ణయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. షోయబ్ మాలిక్ సేవలను సక్రమంగా వినియోగించుకోలేకపోయాడని విమర్శించాడు. మాజీ కెప్టెన్లు జావేద్ మియందాద్, మహమ్మద్ యూసుఫ్, రషీద్ లతీఫ్, మాజీ ఆటగాళ్లు మోసిన్ ఖాన్, సర్ఫ్‌రాజ్ నవాజ్ తదితరులు కూడా పాక్ జట్టు వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. టి-20 వరల్డ్ కప్ పోటీలకు ముందు ఈ విధమైన పరాజయాలు జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. ఇకనైనా లోపాలను సరిదిద్దుకొని, టి-20 వరల్డ్ కప్‌కు సిద్ధం కావాలని హితవు పలికారు.