క్రీడాభూమి

గంగూలీ పాత్ర సుస్పష్టం: మనోహర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: భారత క్రికెట్‌లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాత్ర స్పష్టంగా ఉందని, అతనికి పరస్పర ప్రయోజనాలు లేవని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్పష్టం చేశాడు. గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అతనికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలోని ఫ్రాంచైజీ అట్లాటికో డి కోల్‌కతా (ఎటికె)లో భాగస్వామ్యం ఉంది. ఆ ఫ్రాంచైజీని సంజీవ్ గోయెంకా కూడా సహ భాగస్వామి. ఇలావుంటే, ఐపిఎల్‌లోని రెండు కొత్త ఫ్రాంచైజీల్లో ఒకటైన పుణెను సంజీవ్‌కు చెందిన న్యూ రైజింగ్ సంస్థ కొనుగోలు చేసింది. ఎటికెలోనూ సంజీవ్‌కు వాటా ఉన్నదని, అందులో గంగూలీ కూడా భాగస్వామిగా ఉన్నాడని మనోహర్‌కు విలేఖరులు గుర్తుచేశారు. ఈ కారణంగా గంగూలీకి పరస్పర ప్రయోజనాల అంశం వర్తిస్తుందా అని ప్రశ్నలు గుప్పించారు. దీనిపై మనోహర్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పాడు. తాను వృత్తిరీత్యా న్యాయవాదిని కాబట్టి ఈ విషయాన్ని బలంగా చెప్పగలనని అన్నాడు. ఒక వ్యక్తి ముందుగానే ఓ సంస్థలో భాగస్వామిగా ఉండి, ఆతర్వాత బిసిసిఐలోకి వస్తే, అది పరస్పర ప్రయోజనాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదన్నాడు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని మనోహర్ స్పష్టం చేశాడు. ఏఏ కేసులు దీని పరిధిలోకి వస్తాయో పరిశీలించి నిర్ధారించడానికి అంబూడ్స్‌మన్‌ను నియమించిన విషయాన్ని అతను గుర్తుచేశాడు. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎపి షా ఈ కేసులను పరిశీలిస్తారని అన్నాడు.