క్రీడాభూమి

కివీస్ క్రికెట్ హీరో మార్టిన్ క్రో మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్: సుమారు ఒకటిన్నర సంవత్సరాలు కేన్సర్‌తో పోరాడిన న్యూజిలాండ్ క్రికెట్ హీరో మార్టిన్ క్రో గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులను దుఃఖ సాగరంలో ముంచిన 53 ఏళ్ల కివీస్ మాజీ కెప్టెన్ తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. 1982-1995 మధ్యకాలంలో, 13 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో మార్టిన్ క్రో అద్వితీయ ప్రతిభ కనబరచి, న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే అసాధారణ బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించిన మార్టిన్ క్రో మృతి పట్ల యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రిటైరయ్యే సమయానికి అతను న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు (5,444), అత్యధిక స్కోరు (299), ఎక్కువ అర్ధ శతకాలు (35), అత్యధిక శతకాలు (17) చేసిన కివీస్ బ్యాట్స్‌మన్‌గా రికార్డులు సృష్టించాడు. వీటిలో అత్యధిక సెంచరీల రికార్డును ఇప్పటికీ పదిలంగానే ఉంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) హాల్ ఆఫ్ ఫేమ్ గుర్తింపును పొందిన మార్టిన్ క్రో సోదరుడు జెఫ్ క్రో కూడా క్రికెటరే. మార్టిన్ క్రో మృతితో తాను సన్నిహితుడిని, మార్గదర్శకుడిని కోల్పోయానని అతని సన్నిహిత బంధువు, హాలీవుడ్ నటుడు రసెల్ క్రో వాపోయాడు. మార్టిన్ క్రో అసలుసిసలైన క్రీడాకారుడని, అందుకే, అత్యంత అరుదైన లింఫోమా కేన్సర్ బారిన పడినప్పటికీ రెండేళ్లు వీరోచిత పోరాటం సాగించాడని న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ ప్రశంసించాడు. అతని మృతి న్యూజిలాండ్ క్రికెట్‌కేగాక, యావత్ క్రీడా ప్రపంచానికే తీరని లోటని అన్నాడు.

క్రికెట్ ప్రపంచం ఘన నివాళి
మీర్పూర్, మార్చి 3: మార్టిన్ క్రోకు క్రికెట్ ప్రపంచ ఘన నివాళులర్పించింది. ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్‌లో గురువారం పోటీపడిన భారత్, యునైటెడ్ యరబ్ ఎమిరేట్స్ ఆటగాళ్లు మ్యాచ్ ఆరంనానికి ముందు రెండు నిమిషాలు వౌనం పాటించి, దివంగత క్రికెట్ దిగ్గజానికి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ సంఘాలు, సమాఖ్యలు కూడా మార్టిన్ క్రో మృతి పట్ల ది గ్భ్రాంతి వ్యక్తం చేశాయ. అతనికి ఘన నివాళులర్పించాయ. అనంతరం ఆటగాళ్లంతా అతని మరణానికి సూచికగా నల్ల బ్యాండ్లను ధరించి మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఇలావుంటే, మార్టిన్ క్రో సోదరుడు, మాజీ క్రికెటర్ జెఫ్ క్రో ఈ మ్యాచ్‌కి ఐసిసి రిఫరీగా వ్యవహరిస్తున్నాడు. తన బాధ్యతలను పూర్తి చేసిన తర్వాత స్వదేశానికి వెళ్లనున్నట్టు అతను ప్రకటించాడు.
కాగా, పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు మార్టిన్ క్రోతో తమకు ఉన్న పరిచయాలను, అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అతని మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మార్టిన్ క్రో ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. క్రికెట్‌లో కొత్తకొత్త విధానాలను ప్రవేశపెట్టిన ఘనత మార్టిన్ క్రోకు దక్కుతుందని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కొనియాడాడు.