క్రీడాభూమి

మెయిన్ డ్రాలోకి కశ్యప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, సెప్టెంబర్ 12: కామనె్వల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో తన పోరాటాన్ని విజయవంతంగా ప్రారంభించాడు. సియోల్‌లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అతను చైనీస్ తైపీకి చెందిన లిన్ యు హియెన్, కన్ చావో యు (తైవాన్)పై వరుస విజయాలు సాధించి మెయిన్ డ్రాలో ప్రవేశించాడు. జూలైలో జరిగిన యుఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ టోర్నమెంట్‌లో రన్నరప్ టైటిల్ సాధించిన కశ్యప్ 35 నిమిషాల్లో ఏకపక్షంగా ముగిసిన తొలి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 21-19, 21-9 గేముల తేడాతో హియెన్‌ను మట్టికరిపించాడు. ఆ తర్వాత రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 21-19, 21-18 గేముల తేడాతో తైవాన్‌కు చెందిన కన్ చావోను చిత్తు చేసిన కశ్యప్ మెయిన్ డ్రా తొలి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన సు జెన్ హవోతో తలపడనున్నాడు. హవోతో ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడుసార్లు విజయం సాధించిన కశ్యప్ ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2014 ఎడిషన్‌లో ఒకే ఒక్కసారి ఓటమిని ఎదుర్కొన్నాడు. ఇదిలావుంటే, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, అశ్వనీ పొన్నప్ప కూడా మెయిన్ డ్రాలో ప్రవేశించారు. సుదీర్మన్ కప్ టోర్నమెంట్‌లో చక్కటి ప్రదర్శనతో రాణించిన వీరు తొలి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 21-12, 21-15 గేముల తేడాతో జర్మనీకి చెందిన పీటర్ కయెస్బయెర్, ఓల్గా కొనోన్ జోడీపై, హోరాహోరీగా జరిగిన రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 27-25, 21-17 తేడాతో ఇండోనేషియాకి చెందిన రొనాల్డ్ రొనాల్డ్, అన్నిసా సౌఫికా జోడీపై విజయం సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్ మెయిన్ డ్రాలో బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్, అశ్వనీ హాంకాంగ్‌కు చెందిన తంగ్ చున్ మన్, సె యింగ్ సుయెట్ జోడీతో తలపడనున్నారు.
ఆదిలోనే ముగిసిన
ప్రణవ్-సిక్కీ పోరాటం
అయితే మిక్స్‌డ్ డబుల్స్ మెయిన్ డ్రాలో భారత్‌కు చెందిన ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎన్.సిక్కీరెడ్డి పోరాటం ఆదిలోనే ముగిసింది. తొలి రౌండ్‌లో వీరు 21-13, 19-21, 15-21 గేముల తేడాతో ఇండోనేషియాకి చెందిన నాలుగో సీడ్ జోడీ ప్రవీణ్ జోర్డాన్, డెబ్బీ సుశాంటో చేతిలో పరాజయం పాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు.

చిత్రం..పారుపల్లి కశ్యప్